చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాలి; దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలి!!

టిడిపి అధినేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడంతో వైసిపి నేతలు చంద్రబాబు పై మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. చంద్రబాబు ఐటీ నోటీసులకు సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏపీ అధ్యక్షుడు చంద్రబాబు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు దీనికి సమాధానం చెప్పలేదని, సమాధానం చెప్పడంలో జాప్యం జరిగితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని అయినా విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబు దీని నుండి తప్పించుకోలేరని, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబు పైన ఉంటుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.

Chandrababu

కేంద్రంలో అనేక ప్రభుత్వాలను తానే నడిపించానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు సమాధానం చెప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా నిలదీశారు. అసలు అవినీతి అంటే తెలియదన్నట్టు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏం సమాధానం ఇస్తారో చెప్పాలన్నారు. విక్కీ జైన్, మనోజ్ పార్థసాని చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించిన ఆయన ఆ విషయం చంద్రబాబును చెప్పమనండి అంటూ ప్రశ్నించారు.

విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారు అని ఐటీ శాఖ చెబుతుంది అని, ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయని డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి వాట్సప్ చాట్ లో వివరాలన్నీ ఉన్నాయని తక్షణం విక్కీ జైన్ ను, మనోజ్ పార్థసాని ని, చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.

Chandrababu

అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే నని చంద్రబాబు అవినీతిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇక తాజాగా జారీ అయిన ఐటీ నోటీసులపై దమ్ముంటే చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+