చంద్రబాబు రాయలసీమ బిడ్డనా: డిఎన్ఎ పరీక్షలు చేయించుకోవాలా?

కడప: తాను రాయలసీమ బిడ్డనే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు చెప్పుకోవడంపై సిపిఎం కడప జిల్లా నాయకుడు ఆంజనేయులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు వచ్చిన ప్రతిసారీ తాను కూడా రాయలసీమ బిడ్డనేనని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు.

తమకైతే చంద్రబాబు రాయలసీమ బిడ్డలా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ అయితే డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధపడాలని అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో చంద్రబాబును జగన్‌ కూడా నిలదీయాలని సూచించారు. కడప స్టీట్‌ ప్లాంట్‌ కోసం అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ప్రభుత్వాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలుఒత్తిడి తేవాలని కోరారు.

రాయలసీమకు సాగు నీరు ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ శనివారంనాడు మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు జిల్లా కమ్యూనిస్టుల నాయకులు హాజరయ్యారు. చంద్రబాబు అన్ని తీసుకెళ్లే అమరావతిలోనే పెడుతున్నారని జిల్లా సీపీఎం నాయకుడు అంజనేయులు విమర్శించారు. దీని వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందన్నారు. పైగా రాయలసీమ వారిని రౌడీలుగా, హంతకులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.

Chandrababu should prepare for DNA test: Anjaneyulu

చంద్రబాబును నమ్ముకుంటే ఆయన మనవడు దేవాన్ష్‌కు 20 ఏళ్లు వచ్చినా రాయలసీమ జనం ఇలాగే బతకాల్సి ఉంటుందని మరో వామపక్ష నేత ఈశ్వరయ్య అన్నారు. కడప జిల్లాకు నీళ్లు తెస్తామంటూ టీడీపీ నేత, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి గడ్డం పెంచుకుని ఏడాదిన్నరగా తిరుగుతున్నారని అన్నారు. సతీష్ రెడ్డి గడ్డం పెరుగుతోంది కానీ నీళ్లు మాత్రం రావడం లేదన్నారు.

ఇప్పటికైనా జనంలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టేలా గడ్డాలు పెంచుకోవడం మానేసి చంద్రబాబుపై ఒత్తిడి తెవాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న ఉర్దూ యూనివర్శిటీని కూడా తరలించుకుపోయారని, దీనిపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. భ్రమరావతిని నీరు మట్టి తీసుకురమ్మని చంద్రబాబు ఆదేశించగానే గోచిలు ఎగ్గట్టుకుని టీడీపీ నేతలు వెళ్లారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+