వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు విజయ సంకేతం, టీడీపీ శ్రేణుల సంబరాలు, తీవ్ర అసంతృప్తిలో జగన్?

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో... టీడీపీలో సంబరాలు అంబరాన్నంటగా.. అటు వైసీపీలో తీవ్ర అసంతృప్తి, అంతర్మథనం మొదలయ్యాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో... టీడీపీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. ఇటు నంద్యాలలోనే కాకుండా, అటు విజయవాడలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, సంబరాలు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు తన నివాసం వద్ద విక్టరీ సింబల్ ను చూపిస్తూ, ఎన్నికలో విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. 15వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి దాదానె 26 వేల మెజార్టీని సాధించారు.

Chandrababu Shows Victory Symbol, TDP in Celebrations, YS Jagan Review with Important Leaders

Recommended Video

Nandyal ByPolls Results Update : Gospadu Result Crucial

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలను పార్టీ ముఖ్యనేతలతో కలసి హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా, ఈ ఎన్నికలో గెలుపు ఖాయమనుకున్న తరుణంలో... ఫలితాలు తీవ్ర నిరాశాజనకంగా రావడంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కినట్టు సమాచారం.

15 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ... సమయం మొత్తాన్ని చంద్రబాబును తిట్టడానికే జగన్ కేటాయించారని, వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు 15వ రౌండ్ లో కూడా టీడీపీ 1442 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu shown victory symbol after getting majority in 15th round of counting of nandyal by poll. TDP cadre is in full josh and they fired crackers in front of CM Chandrababu Naidu's House at Vijayawada. On the other hand YCP Chief YS Jagan participated in a meeting with important leaders of his porty in his house Lotus Pond at Hyderabad to review the election result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X