రోడ్డు పక్కన దాబా హోటల్లో ఆగి చంద్రబాబు టీ తాగారు
ఒంగోలు : ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరినీ అశ్చర్యపరిచారు. బుధవారం ఒంగోలు పర్యటన ముగించుకొని రోడ్డుమార్గాన విజయవాడకు బయలుదేరారు. తన ప్రయాణంలో మార్గమధ్యలో మద్దిపాడు మండలం గుళ్లాపల్లి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న దాబా హోటల్ వద్ద ఆగి టీ తాగారు.
దాదాపు 10 నిమిషాల పాటుఆయన దాబా వద్ద ఆగారు. అక్కడే కొద్దిసేపు కూర్చొని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, రావెల కిషోర్‌బాబు, బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన, ఆమంచి కృష్టమోహన్, ఏలూరి సాంబశివరావు, పాలపర్తి డేవిడ్‌రాజు, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

వేదికపై చంద్రబాబు నిర్లక్ష్యానికి గురైన టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్టమూర్తి కూడా ఆ సమయంలో ఉన్నారు. కరణం బలరామమూర్తితో కూడా చంద్రబాబు మాట్లాడారు.
బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒంగోలుకు హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి హెలికాప్టర్‌లోనే వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడం, చీకటి పడుతుంటంతో రోడ్డు మార్గాన విజయవాడ వెళ్లారు.












Click it and Unblock the Notifications