Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ మిత్రుడు, ఏమీ అనొద్దు: బాబు, నిందిస్తున్నారని ఆవేదన

విజయవాడ: రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనకు మిత్రుడు, మనం కలుపుకొని పోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ పార్లమెంటు సభ్యులతో అన్నారు. విమర్శలు చేసేవాళ్లు చేస్తున్నా మనం ఏం చేస్తున్నామో ప్రజలకు వివరిస్తుండాలని, అది మన బాధ్యత అనిని చంద్రబాబు చెప్పారు. తమపై జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలను కొంతమంది ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ ఆ విధంగా అన్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తమ మిత్రుడని, ఆయనతో తమకు విభేదాలు లేవని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. ఇంకా బాగా పని చేయాలనే పవన్ కళ్యాణ్ తమకు చెప్పారని, పవన్ కళ్యామ్ సూచనలను కూడా తీసుకుని ముందుకు వెళతామని ఆయన చెప్పారు.

Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్లమెంటు సభ్యుల సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు తానే కారణమని కొన్ని పార్టీలు అకారణంగా తనపై దుష్ప్రచారానికి ఒడిగట్టాయని సమావేశంలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రైల్వే జోన్‌కు సం బంధించి కేంద్ర కేబినెట్‌ తీసుకోవాల్సిన నిర్ణయం పైనా గట్టిగా ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

రాష్ట్ర విభజన చట్టం, పార్లమెంటులో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటి గురించి పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా అడగాలని, కేంద్రం నుంచి సమాధానం తీసుకోవాలని చంద్రబాబు టిడిపి ఎంపీలకు సూచించారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని, దానిని నూటికి నూరు శాతం అమలు చేసేలా చూడాలని చెప్పారు.

హైదరాబాద్‌లోని స్థానికేతరులకు సెక్షన్‌ 8 ప్రకారం గవర్నర్‌ రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. 9, 10 షెడ్యూళ్లలోని అంశాలతోపాటు వాటిలో ప్రస్తావించని విషయాలనూ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని, 9, 10 షెడ్యూళ్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, అప్పా, ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ తదితరాలను చేర్చటానికి ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.

విజయవాడలో జరిగిన టిడిపి పార్లమెంటు సభ్యుల సమావేశంలో ఏపీ, తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రజలు ఫలితాలు చూస్తారని, దానిని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పారు.

రాజధాని పరిధిలోని 30 వేల ఎకరాల అటవీ భూమి డీనోటిఫైకి పర్యావరణ శాఖ అంగీకరించిదని సుజనా చౌదరి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి సంస్థలను స్వాధీనం చేసుకుంటే, ఆంధ్రాలో వాటి ఏర్పాటుకయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వమే భరించాలని సుజనా అన్నారు. 9,10 షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల పరిరక్షణకు వర్కింగ్ గ్రూప్‌ను నియమించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+