చంద్రబాబు కీలక నిర్ణయం- కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి తెర..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో పాదాభివందనాలు చేస్తూ అడుగులకు మడుగులెత్తే సంస్కృతికి తెరదించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తమ పార్టీ నేతలకు కీలక సూచన చేసారు. అంతే కాదు తాను కూడా ఇకపై దీన్ని పాటిస్తానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పకుండా పాటించాల్సిన పరిస్ధితి ఎదురుకాబోతోంది.
ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‍చాట్ నిర్వహంచారు. ఇందులో కీలక వ్యాఖ్యలుచ చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని నేతలకు ఆయన సూచించారు. ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు తాను దండం పెడతానన్నారు. ఇవాళ్టి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‍స్టాప్ పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు తెలిపారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దన్నారు. నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications