కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఆసక్తికర పని చేసిన చంద్రబాబు.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో, నేడు ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఇంకా 10 మంది వరకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
నేడు ఎన్డీయే శాసన సభా పక్ష నేతను ఎన్నుకునే సమావేశం ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ సమావేశానికి టిడిపి జనసేన బిజెపి నేతలు హాజరయ్యారు . ఇక కూటమి శాసనసభ్యులంతా ఈ సమావేశానికి హాజరై చంద్రబాబు నాయకత్వాన్ని సమర్ధించారు. చంద్రబాబు నాయుడు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీతో పాటు ప్రతి ఒక్కరు ఆయనను ఏకగ్రీవంగా ఆమోదించారు.

ప్రత్యేక కుర్చీని తీసివేయించి అందరితో సమానంగా కూర్చున్న చంద్రబాబు
అయితే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన చంద్రబాబు వేదికపై తనకు వేసిన ప్రత్యేక కుర్చీని తీసి వేయించి అందరితో సమానంగా తనకుర్చీని మార్పించుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నది అందరికీ అర్థమయ్యేలాగా చంద్రబాబు చేసిన పని ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.
అంతా సమానమే అన్న భావన కలిగించే పనిలో చంద్రబాబు
కూటమిని మూకుమ్మడిగా ఒకే తాటిపై ముందుకు నడిపించాల్సిన నాయకుడు చంద్రబాబు చివరికి కుర్చీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుని అందరితో సమానంగా మార్పించుకున్నారు అన్న చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వచ్చినప్పటికీ తనతో కలిసి వచ్చిన పార్టీలకు ప్రముఖ స్థానం ఇచ్చేందుకే చంద్రబాబు ఈ చర్యకు పాల్పడ్డారని కూడా చర్చిస్తున్నారు.
కూటమి శాసనసభా పక్ష సమావేశంలో ఆసక్తికర పని చేసిన చంద్రబాబు..!!#Chandrababu #ChandrababuNaidu #PawanKalyan #NDAMeeting #Oneindiatelugu pic.twitter.com/E5ThVHQcmH
— oneindiatelugu (@oneindiatelugu) June 11, 2024
కూటమి మైత్రి ఐదేళ్ళు ఇలాగే ఉంటుందా? చర్చ
పదవులు వచ్చాయని విర్రవీగకూడదని, వినయంగా ఉండాలని అందరితో కలిసిమెలిసి రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలనే చంద్రబాబు ఆలోచన నేపథ్యంలోనే ఆయన అందరితో సమానంగా కుర్చీని మార్పించుకున్నారని చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పటికి ఓకె.. కూటమి మైత్రి ఐదేళ్లపాటు ఇలాగే కొనసాగుతుందా? చంద్రబాబు ఈ ఐదేళ్ల కాలం కూటమిలోని పార్టీలకు ఇంతే ప్రాధాన్యత ఇస్తారా? వారిని సంతృప్తి పరచగలరా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications