రివర్స్‌లో జగన్ పాలన- కేసీఆర్ కూడా చెప్పారు- చంద్రబాబు వ్యాఖ్యలు
టీడీపీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా టీడీపీ ప్రభుత్వాల పాలనను పార్టీ అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉండగా.. తాము శ్రీకారం చుట్టిన జీనోమ్ వ్యాలీలో నేడు కరోనా వ్యాక్సిన్ తయారైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ వ్యవస్ధాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పుట్టుక నుంచి చోటు చేసుకున్న పలు పరిణామాలను చంద్రబాబు ప్రస్తావించారు. రైతు సంక్షేమ కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, పేదల పక్కా ఇళ్లకు కూడా 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారని తెలిపారు. 9 నెలల్లో ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలనే వైఎస్ సహా తర్వాతి ముఖ్యమంత్రులు అమలు చేశారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో మూడెకరాలు కొనే పరిస్ధితులు రివర్స్ అయ్యాయని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ సర్కార్ రెండేళ్లలో ప్రతీ కుటుంబంపై రెండున్నర లక్షల రుణభారం మోపిందని ఆయన ఆరోపించారు. సామాన్యులు బతకలేని విధంగా ధరలు పెంచేశారన్నారు.












Click it and Unblock the Notifications