చంద్రబాబు మాకు నేర్పుతున్న పాఠాలివే.. ! వైసీపీ మాజీ మంత్రి షాకింగ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం స్కాంలో అప్పటి కీలక అధికారుల్ని అరెస్టులు చేసి జైలుకు పంపడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం స్కాంలో నిందితుల్ని వరుస అరెస్టులు చేయడం ద్వారా వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రభుత్వం తీరుపై ఇవాళ మరోసారి ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ నేత అనిల్ యాదవ్ ఆరోపించారు. ఏడాది పాలనలో హామీల అమలు ఊసే లేదన్నారు. లేని స్కామ్‌లను సృష్టించి ప్రభుత్వ అధికారులపైనా కక్షసాధింపుకు దిగుతున్నారన్నారు. ఏపీ వైపు చూడాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల అరెస్టులు మాత్రమేనన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం కక్షసాధించాలనే లక్ష్యంతోనే, సంబంధం లేని అధికారులకు కూడా అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టికాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు. సీఎంఓలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్ ప్రజల్లో చర్చనీయాంశం అయ్యిందన్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రత్యర్థులను వేధింవచ్చని చంద్రబాబు తమకు నేర్పుతున్నారని అనిల్ తెలిపారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఈ మాఫియా కారణంగా నెల్లూరులో మైనింగ్ నిలిచిపోయి వేలాది కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయన్నారు. అది కూడా ఫైన్లు వేసిన మైన్స్ ఓపెన్ చేసి, మైనింగ్ చేస్తున్నారన్నారు. ఎటువంటి జరిమానాలు లేకపోయినా అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయని, దీనికి కారణం ఆయా క్వారీ యజమానులు ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ మాఫియాను అంగీకరించకపోవడమే అన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications