ఆ చోట్ల పవన్‌కళ్యాణ్ ప్రభావం, ఫోన్ చేసి బాబు థ్యాంక్స్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం తమకు కలిసి వచ్చిందని ఆ పార్టీతో పాటు పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పోలింగ్ అనంతరం చంద్రబాబు పవర్ స్టార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇరువురు కాసేపు ఫోన్లో ముచ్చటించుకున్నారు.
పవన్ ప్రచారం వల్ల ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, రాయలసీమల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. పవన్ ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకున్నాయంటున్నారు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింప చేశాయంటున్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలను భయబ్రాంతులను చేసి పోలింగ్ శాతాన్ని వీలైనంత తగ్గించి, లబ్ధి పొందాలని జగన్ పార్టీ ప్రయత్నించిందని కానీ ప్రజలు భయపడలేదని, రికార్డు స్థాయి పోలింగే నిదర్శనమని, సానుకూల దృక్పథంతో ఓటింగ్‌లో పాల్గొన్నారని, పాజిటివ్ పోలింగ్ జరిగిందని, టిడిపికి ఏకపక్ష విజయాన్ని ప్రజలు అందించబోతున్నారని చంద్రబాబు బుధవారం రాత్రి అన్నారు.
అధికారం తమదేనన్నారు. కనీసం 100 అసెంబ్లీ, 15 లోకసభ స్థానాలు గెలుస్తామన్నారు. రైతులు, మహిళలు, బిసిలు, యువత తమ వైపే మొగ్గుచూపారన్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావం చూపారన్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications