invitation selection ap secretariat tammineni sitaram yanamala ramakrishnudu chandrababu naidu ఎంపిక సుచరిత యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు
సీఎం జగన్ అధ్యక్షతన ఆ సమావేశానికి చంద్రబాబు .. సిఐడీ నోటీసుల తర్వాత ఇంట్రెస్టింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీపై, సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే రాజధాని భూముల అక్రమాల వ్యవహారం లో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన తర్వాత నేడు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనాల్సి ఉండడం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబుకు నోటీసులు ఒక్క పేజీనే..అదే జగన్ కు అయితే లారీల్లోనే: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపిక పై ఉన్నత స్థాయి సమావేశం .. బాబుకు ఆహ్వానం
ఏపీ సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల ఎంపిక పై జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న చంద్రబాబుకు ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా సిఎస్ కార్యాలయం నుండి సమాచారం అందింది . ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసన మండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తదితరులు హాజరు కావాల్సి ఉంది.

సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా లేదా ?
అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ కమిటీ సమావేశానికి హాజరుకావాలని సమాచారం అందించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న ఏపీ సిఐడి చంద్రబాబుకు రాజధాని భూముల అక్రమాల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత టీడీపీ వైసీపీ నేతల మధ్య కొనసాగిన మాటల యుద్ధం తెలిసిందే .

సిఐ డీ నోటీసులు , మరుసటి రోజే ఉన్నత స్థాయి సమావేశానికి ఆహ్వానం
ఆ మరుసటి రోజే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయితే ఒకే సమావేశంలో, ఒకే వేదికపై అటు సీఎం జగన్, చంద్రబాబు ఇరువురు ఉండనున్నారు. మరి జగన్ అధ్యక్షతన జరిగే సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా లేకా టీడీపీ నేత యనమలను పంపి ఊరుకుంటారా అనేది తెలియాల్సి ఉంది .