ఆళ్లగడ్డ సస్పెన్స్: బాబుపై ఒత్తిడి, జగన్‌కు షాకిచ్చేనా?

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనే డిమాండ్ స్థానిక నేతల నుండి రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా.. శుక్రవారం టీడీపీ యువనేత నారా లోకేష్ కర్నూలు జిల్లాలతో మాట్లాడటం, గంగుల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే టీడీపీ పోటీ పైన పలురకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు సాయంత్రం మాట్లాడారు. ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయాలన్నారు. నందిగామకు, ఆళ్లగడ్డకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు.

హుధుద్ తుఫాను నేపథ్యంలో విశాఖలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు తిరిగి వచ్చాక ఆళ్లగడ్డలో పోటీ విషయమై చర్చిస్తామని, ఆయనే పోటీ పైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Chandrababu to decide on 'Allagadda bypoll'

అయితే, హుధుద్ తుఫాను ప్రభావం తగ్గే వరకు తాను విశాఖ నుండి రానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాదే వచ్చి నిర్ణయం తీసుకోవడం ఎంత వరకు సాధ్యమని చర్చ సాగుతోంది.

విశాఖలోనే చంద్రబాబు దీని పైన నిర్ణయం తీసుకోవచ్చునని కూడా చెబుతున్నారు. అయితే, సాధ్యమైనంత వరకు పోటీకి దూరంగా ఉండే అవకాశమే ఉందని చెబుతున్నారు. అయితే, చివరి నిమిషంలో టీడీపీ పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని మరికొందరు అంటున్నారు.

మన పార్టీలలో ఉన్న సంప్రదాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇప్పటికే టీడీపీ ప్రకటించి ఉండేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. అయితే, ఆమె ఎన్నికలకు ముందే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

బ్యాలెట్ పేపర్లో ఆమె పేరు తీసివేసేందుకు ఈసీ నిరాకరించింది. దీంతో, ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించిన శోభా నాగిరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు శోభ కూతురు అఖిల ప్రియ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పోటీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+