టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఈ 8 పాయింట్లు చెప్పబోతున్న చంద్రబాబు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 125 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఇవాళ తమ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లతో చంద్రబాబు ఇవాళ పార్టీ కేంద్రం కార్యాలయంలో భేటీ అవుతారు. ఇందులో చర్చించాల్సిన 8 అంశాల అజెండా కూడా ఖరారు చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలిపైనా చంద్రబాబు హెచ్చరికలు చేయబోతున్నారు.
ఇవాళ జరిగే భేటీలో చంద్రబాబు పార్టీ ప్రజా ప్రతినిధులతో చర్చించేందుకు 8 పాయింట్ల అజెండా ఖరారు చేశారు. వీటిలో 125 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, టీడీపీ సభ్యత్వ నమోదు, పల్లె పండుగ, సూపర్ సిక్స్ హామీల అమలు, మద్యం, ఇసుక పాలసీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగునీటి సంఘాల ఎన్నికలు ఇలా పలు అంశాలున్నాయి. అలాగే క్షేత్రస్దాయిలో సమస్యలపై వీరి నుంచి చంద్రబాబు ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు.

మరోవైపు రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక, మద్యం విధానాలను నీరుగార్చేలా సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే తమ వ్యాఖ్యలు, వివాదాలతో మరికొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. అలాంటి వారికి ప్రత్యేకంగా చంద్రబాబు క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎన్డీయే మిత్రపక్ష పార్టీలైన జనసేన, బీజేపీతో సమన్వయం, రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చంద్రబాబు చర్చించబోతున్నారు.












Click it and Unblock the Notifications