నోరు జారిన చంద్రబాబు..తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఎప్పటి మాదిరిగానే అధికార వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తోంది. ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశాయి.ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారానికి కేవలం పది రోజులు సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయమన్న చంద్రబాబు..!#ChandrababuNaidu #TDP #YSRCP #APElections2024 #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/O2hUF6T1vX
— oneindiatelugu (@oneindiatelugu) May 2, 2024
పార్టీల అధినేతలు విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గురువారం అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో చంద్రబాబు తప్పుగా మాట్లాడారు.

ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థికి బదులుగా వైసీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాయచోటి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున రామ్ ప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా, అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి బరిలోకి దిగారు. అయితే చంద్రబాబు టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డికి బదులుగా వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఓటు వేయమని కోరారు. దీంతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రబాబు ఇలా తప్పుగా మాట్లాడటం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన పలుమార్లు వైసీపీకి మద్దతుగా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థికి చంద్రబాబు ఓటు వేయమన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications