కూలిన చెట్లు, బాబు చేతిలో బంగాళదుంపలు(ఫోటోలు)
విజయనగరం: బుధవారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంత ప్రజలందరికీ 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని కూడా తట్టుకొనే విధంగా పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి స్దాయిలో అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని మాత్రం ఆపలేకపోయామని చెప్పారు.
రాష్ట్ర విభజనలో కొన్ని ఇబ్బందులున్నా, బాధితులను ఊదారతతో ఆదుకుంటామన్నారు. తుఫాన్ వల్ల జిల్లాలో 8 మంది మృతి చెందారని,స వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్దిక సాయం అందజేస్తామని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముక్కాంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలతో ఐఏవీ కింద పునర్నిర్మిస్తామని చెప్పారు.
నష్టపోయిన కచ్చా ఇళ్లకు రూ. 25వేలు, పూరి ఇంటికి రూ. 5 వేలు ఇస్తామని చెప్పారు. పడిపోయిన ఒక్కో కొబ్బరిచెట్టుకి రూ. 1,000 పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. సముద్రంలో కొట్టుకుపోయిన మత్స్యకారుల పడవలకు రూ. 10వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
హుదూద్ తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తుఫాన్ నష్టాన్ని అధిగమించిన విధానం ఒక బ్లూబుక్ రూపొందిస్తున్నామని.. దేశంలో ఎక్కడ తుఫాన్ వచ్చిన ఈ బ్లూబుక్ ఉపయోగపడుతుందన్నారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
విశాఖపట్నంలోని కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయనగరంలో బాబు హాల్ చల్
హుదూద్ తుఫాన్ అనంతరం బాధితులతో మట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
హుదూద్ తుఫాన్ అనంతరం బాధితులతో మట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
విజయనగరం వెళ్లడానికి ముందు విశాఖపట్నం అధికారులతో సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయనగరంలో బాబు హాల్ చల్
విశాఖపట్నంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయనగరంలో బాబు హాల్ చల్
విశాఖపట్నంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విజయనగరంలో బాబు హాల్ చల్
కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ముక్కాంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
తుఫాన్ వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలతో ఐఏవీ కింద పునర్నిర్మిస్తామని చెప్పారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
నష్టపోయిన కచ్చా ఇళ్లకు రూ. 25వేలు, పూరి ఇంటికి రూ. 5 వేలు ఇస్తామని చెప్పారు. పడిపోయిన ఒక్కో కొబ్బరిచెట్టుకి రూ. 1,000 పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
సముద్రంలో కొట్టుకుపోయిన మత్స్యకారుల పడవలకు రూ. 10వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.
విజయనగరంలో బాబు హాల్ చల్
హుదూద్ తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

విజయనగరంలో బాబు హాల్ చల్
తుఫాన్ నష్టాన్ని అధిగమించిన విధానం ఒక బ్లూబుక్ రూపొందిస్తున్నామని.. దేశంలో ఎక్కడ తుఫాన్ వచ్చిన ఈ బ్లూబుక్ ఉపయోగపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications