హైద్రాబాద్‌పై నాకూ హక్కు, రాష్ట్రాల మధ్య గొడవ చాలా దూరం పోతుంది, ఒక్కో అస్త్రం తీస్తా: కేసీఆర్‌కు బాబు హెచ్చరిక

అమరావతి: హైదరాబాదు పైన కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో మాకు అంతే ఉందని, మీ వద్ద ఏసీబీ ఉంటే మా వద్ద ఉందని, నేను కళ్లు తెరిస్తే కేసీఆర్ ఇబ్బందుల్లో పడతారని, తన పైన తప్పుడు కేసులు పెడితే వదిలి పెట్టే సమస్యే లేదని, మాపై పెత్తనానికి మీరెవరని, రెండు రాష్ట్రాల మధ్య గొడవలు వద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.

మహా సంకల్ప దీక్షలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా కుట్ర చేస్తున్నాయన్నారు. నేను నీతి నిజాయితీగా బతికానన్నారు. ఈ కేసీఆర్ నా మీద కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాదు ఉమ్మడి రాజధాని అన్నారు.

హైదరాబాద్ పైన మాకూ హక్కు

అక్కడ మనం పదేళ్లు అక్కడ ఉండవచ్చునని, హైదరాబాదు పైన పదేళ్ల వరకు మీకు ఎంత హక్కు ఉందే, మాకు అంతే హక్కు ఉందన్నారు. ఖబడ్దార్ కేసీఆర్ అన్నారు. తెలంగాణలో మన వాళ్లను ఐదుగురిని కొన్నారని, వైసీపీకి చెందిన ఇద్దర్ని కొన్నారని ఆరోపించారు. నా ఫోన్ ట్యాప్ చేశారంటే కడుపు మండుతోందన్నారు.

జగన్‌కు బుద్ధిలేదు

Chandrababu warns KCR and YS jagan

తమ పార్టీకి చెందిన ఇద్దర్ని కొన్నప్పటికీ వైసీపీ చీఫ్ జగన్ బుద్ధి లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేశారన్నారు. అధికారం ఉందని స్టింగ్ ఆపరేషన్ చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం సరికాదన్నారు. నీచాతి నీచం అన్నారు. ఫోన్లను ట్యాపింగ్ చేస్తే ప్రభుత్వాలే కూలాయన్నారు.

హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలన్నాను

నా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారన్నారు. నాదో ప్రభుత్వం, నీదో ప్రభుత్వమని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలన్నారు. నన్ను బెదిరించాలంటే కేసీఆర్ తరం కాదన్నారు.

నాకూ ఏసీబీ ఉంది

నీకు ఏసీబీ ఉన్నట్లే, నాకు ఏసీబీ ఉందని, నీకు పోలీసులు ఉన్నట్లే, నాకు పోలీసులు హైదరాబాదులోనే ఉన్నారని హెచ్చరించారు. మా ఎమ్మెల్యేను మీ ఫాం హౌస్‌కు తీసుకు వెళ్లి కొన్నావన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రాజీనామా చేయకుండానే మంత్రి పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఎవరు లాలూచీ పడ్డారని ప్రశ్నించారు. నేను లాలూచీ పడలేదన్నారు. నాకు ఓ ఎమ్మెల్సీ ముఖ్యం కాదని, సిద్ధాంతం, నీతి ముఖ్యమని చెప్పారు. హైదరాబాదు విశ్వనగరంగా మారింది నా చొరవ వల్లే అన్నారు. నీ వల్ల హైదరాబాదుకు విశ్వనగరంగా గుర్తింపు రాలేదన్నారు.

ప్రజల కోసం ప్రాణాలిస్తా

ప్రజల కోసం నేను ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. నేనేమైనా తెలంగాణ సర్వెంట్‌నా అని ప్రశ్నించారు. హైదరాబాదులోని ఆంధ్రుల ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నించారన్నారు. నాపై కాంగ్రెస్, తెరాస, వైసీపీలు కుట్ర పన్నాయన్నారు.

నన్ను అగౌరవపర్చారంటే ఐదు కోట్ల తెలుగు ప్రజలను అవమానపర్చినట్లే అన్నారు. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు నీకు బుద్ధి లేదా అని ప్రశ్నించారు. సృష్టించిన డాక్యుమెంట్లతో నన్ను బెదిరించలేరన్నారు. ఒక్కొక్క అస్త్రాన్ని సమయం వచ్చినప్పుడు వదులుతానని చెప్పారు.

నేను అంత ఈజీగా వదలని చెప్పారు. మా పైన పెత్తనం చెలాయించేందుకు మీరు ఎవరన్నారు. నా ఫోన్లు ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. నేను ఏమైనా తెలంగాణ సర్వెంట్‌నా అని నిలదీశారు. జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇక్కడ ఓ మహానాయకుడు ఉన్నాడని, ఆయన జైలుకు వెళ్లి వచ్చి నన్ను నిలదీస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎవ్వర్నీ వదిలిపెట్టను

ఎవరికో నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, కానీ ప్రజాస్వామ్యం కాబట్టి సమాధానం చెబుతున్నానని అన్నారు. ఖబడ్దార్ ఎవ్వర్నీ వదిలి పెట్టనని చెప్పారు. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను... ప్రజల కోసం కాదా అన్నారు.

తెరాస ప్రభుత్వానికి హెచ్చరిక

తెరాస ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నానని, దయచేసి రాష్ట్రాల మధ్య తగాదాలు వద్దని, అలా చేస్తే నేను చాలా చేస్తానని అన్నారు. రాష్ట్రాల మధ్య గొడవ అది చాలా దూరం పోతుందన్నారు. నేను కన్ను తెరిస్తే మీకు చాలా కష్టాలు వస్తాయన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. ఇది మీ జాగీరు కాదన్నారు. రేవంత్ వ్యవహారంలో కుట్ర చేశారని అభిప్రాయపడ్డారు.

ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తే సామాన్యులకు అండ ఏదన్నారు. మనం దీని పైన అందరం పోరాడుతామని చెప్పారు. తనకు ప్రజలే హైకమాండ్ అన్నారు. నేను కళ్లు తెరిస్తే కేసీఆర్‌కు కష్టాలు తప్పవన్నారు. కేసీఆర్ ట్యాంకుబండు పైన సంబరాలు చేసుకొని, మనం మహా సంకల్పం చేసుకోకుండా కుట్ర పన్నారన్నారు.

నాకూ అన్నే అధికారాలు

కేసీఆర్‌కు ఎన్ని అధికారాలు ఉంటే నాకు అన్నే ఉన్నాయన్నారు. రాత్రి కూడా ఆలోచించానని, మనకు స్వయం ప్రతిపత్తి ఉందని, నేను తప్పులు చేయనని, తప్పుడు కేసులు పెడితే మాత్రం వదిలి పెట్టేది లేదని చెప్పారు. మంచిగా ఉంటే మంచిగా ఉంటానని, లేదంటే వదిలి పెట్టే సమస్య లేదన్నారు. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రాన్ని తీస్తానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+