Chandrababu: వైసీపీ నేతలపై దాడుల వేళ టీడీపీ నేతలకు బాబు కీలక సూచన..!
ఏపీలో కల్తీ నెయ్యి వివాదంపై సీబీఐ సిట్ రిపోర్ట్ తర్వాత దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైఎస్సార్సీపీ మొదలుపెట్టిన మైండ్ గేమ్ లో అధికార టీడీపీ పడిందా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని, అయితే ఇతర రసాయనాలతో కల్తీ జరిగిందంటూ సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది గతంలో చంద్రబాబు (chandrababu), పవన్ కళ్యాణ్ చేసిన జంతుకొవ్వు ఆరోపణలకు విరుద్ధంగా ఉండటంతో వైసీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.
ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తమ వాదనే నిజమైందని, చంద్రబాబు వాదన అబద్దమని తేలిపోయిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఫ్రస్టేట్ అయిన టీడీపీ నేతలు నెయ్యి కల్తీతో వైఎస్సార్సీపీ మహాపాపం చేసిందంటూ పలు చోట్ల ఫ్లెక్సీల ప్రచారం ప్రారంభించారు. వీటిపై జగన్, భూమన, సుబ్బారెడ్డి ఫొటోలు కూడా పెట్టడంతో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వాటిని తొలగించేందుకు చేసిన ప్రయత్నాన్ని టీడీపీ నేతలు, పోలీసులు అడ్డుకోవడంతో ఫ్రస్టేషన్ లో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ .. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలకు దిగారు.

వీటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కార్యకర్తలు, నేతలు.. అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులకు దిగారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కనిపించింది. దీనిపై తాజాగా టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారం కోల్పోయామనే ఫ్రస్ట్రేషన్ లో వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని, వాళ్ల ట్రాప్ లో టీడీపీ నేతలు పడొద్దని హెచ్చరించారు. అసహనంతో రెచ్చగొట్టే చర్యలు పాల్పడుతున్న వైసీపీ నేతలు, అలజడి సృష్టిస్తున్నారన్నారు. వైసీపీ ట్రాప్ లో పడితే వారికీ, మనకూ తేడా ఉండదన్నారు. కాబట్టి శాంతించాలని వారిని కోరారు.












Click it and Unblock the Notifications