వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ అవినీతిపై నారా రోహిత్ అస్త్రం: చీఫ్‌గెస్టు బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Rohit and Babu
హైదరాబాద్: బాణం, సోలో, ఒక్కడినే వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నారా రోహిత్ తన తాజా చిత్రం ప్రతినిధిలో ప్రస్తుత రాజకీయాల పైన పదునైన అస్త్రాలు సంధిస్తున్నారు! రాజకీయాలను ప్రశ్నించే ప్రజా ప్రతినిధిగా నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో వర్తమాన రాజకీయాల పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘పద్దెనిమిది సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే... వస్తున్నా... అడగడానికే వస్తున్నా..', ‘అధికారం... అధికారం... అధికారం... ఎముందిరా అందులో. చుట్టూ పదిమంది సెక్యూరిటీ. ఉదయాన్నే లేస్తే ఇంటి చుట్టు వందమంది కార్యకర్తలు. సొసైటీలో పలుకుబడి. తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత. మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్లిపోతారు. దీని కోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా?' అనే పదునైన డైలాగులు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు అయిన నారా రోహిత్ సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మక సినిమా తీయడమే కాకుండా.. సినిమా ఆడియో విడుదలను పెదనాన్న చేతుల మీదుగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. నవంబర్ 13న విడుదలయ్యే ఈ ఆడియో విడుదలకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ప్రతినిధి సినిమాలో రాజకీయ అవినీతి పైన అస్త్రాలు ఎక్కు పెట్టారట. గతంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాల్లోను రాజకీయాలను ప్రస్తావించారు. బాలకృష్ణ శ్రీమన్నారాయణ చిత్రం ఉప ఎన్నికల సమయంలో వచ్చింది. అందులో రాజకీయాల ప్రస్తావన ఉంది. బాలయ్య తాజా చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా కూడా రాజకీయ కోణంలోనే తీస్తున్నారు.

English summary

 Nara Rohit tweeted that Pratinidhi movied audio release on November 13th. Chief Guest is our N Chandrababu Naidu in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X