ముద్రగడ కేసుపై మనసు మార్చుకున్న చంద్రబాబు ! జీవో వెనక్కి..!
ఏపీలో గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన తుని రైలు దహనం ఘటన తీవ్ర కలకలం రేపింది. కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో అప్పట్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ఆపి నిరసనకారులు తగులబెట్టారు. అయితే ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత విజయవాడ కోర్టు ముద్రగడ పద్మనాభం సహా ఇతర నిందితుల్నీ నిర్దోషులుగా విడిచి పెట్టింది.
ఈ కేసులో తగిన సాక్ష్యాలు లేవన్న కారణంతో విజయవాడ రైల్వే కోర్టు గతంలోనే ఈ తీర్పు ఇచ్చింది. ఇది జరిగి ఏడాది దాటిపోయిన తర్వాత ప్రభుత్వం నిన్న ఈ కేసులో రైల్వే కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. అయితే సర్కార్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. గత ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సామాజిక వర్గాన్ని ఇది కెలికినట్లవుతుందన్న అభిప్రాయం ప్రభుత్వంలో వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గింది.

తుని ఘటనపై రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్లేందుకు నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం ఇవాళ ఉపసంహరించుకుంది. మే 1న విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఇందులో రైల్వే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లరాదని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో తేనెతుట్టెను కదపకుండా ప్రభుత్వం చివరి నిమిషంలో జాగ్రత్తపడినట్లయింది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications