జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అధికారం కట్టబెడుతున్న చంద్ర‌బాబునాయుడు??

చంద్ర‌బాబునాయుడు ఒక‌వేళ అధికారంలోకి వ‌చ్చినా పెద్ద‌గా ఒరిగేదేమీ లేద‌నే నైరాశ్యం రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. ఇప్పుడున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు వ‌స్తే ఆపేస్తార‌నే ప్ర‌చారం న‌డుస్తోంది. చంద్ర‌బాబు ఎన్ని హామీలిచ్చినా ఈ ప్ర‌చారం ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ అభివృద్ధి అంత సులువు కాదు అనే అభిప్రాయానికి ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. అటువంటిది వ‌చ్చే సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎందుకు పోగొట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లో వారున్నారు.

ముఖ్య‌మంత్రి అయితే అధికారుల మాటే వింటారు?

ముఖ్య‌మంత్రి అయితే అధికారుల మాటే వింటారు?

చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఎవ‌రి మాట విన‌రని కేవ‌లం అధికారుల మాటే వింటార‌ని, పార్టీని ప‌ట్టించుకోర‌నే విమ‌ర్శ ఉంది. ఈ విమ‌ర్శ‌ను దిద్దుకునే అవ‌కాశం 2014లో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌రిదిద్దుకోలేక‌పోయారు. తెలుగు త‌మ్ముళ్ల స్వైర విహారంతోపాటు ఎమ్మెల్యేల అరాచ‌కాలపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పాతుకుపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్టింది.

అధికారంలో ఉన్న‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటార‌నే అప‌ప్ర‌ద‌

అధికారంలో ఉన్న‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటార‌నే అప‌ప్ర‌ద‌


అధికారంలో ఉన్న‌ప‌పుడ‌ల్లా చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటార‌ని, అధికారుల‌కు ద‌గ్గ‌రగా ఉంటార‌నే ప్ర‌చారం ఇప్పుడు కూడా న‌డుస్తూనే ఉంది. మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం కూడా చంద్ర‌బాబును రాబోయే ఎన్నిక‌ల్లో ఇబ్బంది పెట్ట‌బోతోంది. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగిస్తారు కాబ‌ట్టి మూడు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల ఆలోచ‌నా తీరు ఓట్ల ద‌గ్గ‌ర ఎలా ఉంటుందోన‌నే ఆందోళ‌న తెలుగుదేశం వ‌ర్గాల్లో నెల‌కొంది. చంద్ర‌బాబునాయుడు సంక్షేమ ప‌థ‌కాల‌కు దూరంగా ఉంటార‌నే పేరున్న‌ప్ప‌టికీ ప‌సుపు-కుంకుమ లాంటివి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టారు. ఆర్థికంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీని అభివృద్ధి చేయ‌డ‌మంటే కుక్క తోక ప‌ట్టుకొని గాదారిని ఈదిన‌ట్లేన‌ని ఆర్థిక‌వేత్త‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

సంప‌ద సృష్టిస్తారు

సంప‌ద సృష్టిస్తారు


అయితే చంద్ర‌బాబునాయుడు అభివృద్ధిపై ఎక్కువ‌గా దృష్టిసారిస్తారు. ఐటీ రంగంతోపాటు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు, సంప‌ద సృష్టికి ప్రాధాన్య‌తనిస్తారు. గ‌త ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ మెజారిటీతో ఓడిపోయాం కాబ‌ట్టి ఈసారి ఆ మెజారిటీక‌న్నా ఎక్కువ తెచ్చుకొని సాధ్య‌మైన‌న్ని ఎక్కువ నియోజ‌క‌వర్గాల్లో గెలుపొంద‌డం ఖామ‌య‌నే అంచ‌నాలో తెలుగుదేశం పార్టీ నేత‌లున్నారు. ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+