Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెయ్యి మంది టెన్త్ విద్యార్ధుల్ని ఆదుకున్న చంద్రబాబు మంత్రి..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షలకు విద్యార్ధులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే పరీక్షలకు ఫీజుల చెల్లింపు, ఇతర ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు కేబినెట్లో తొలిసారి మంత్రి ఒకరు వారికి అనుకోని సాయం చేశారు. వారి ఇబ్బంది తెలుసుకుని ఆ మంత్రి చేసిన సాయం ఇప్పుడు ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా కూడా నిలుస్తోంది.

రాజకీయం అంటే అందినకాడికి సంపాదించుకోవడమే అనుకునే రోజుల్లో కష్టంలో ఉన్న ఇతరులకు నాలుగు డబ్బులు ఇచ్చే వారు అరుదుగానే కనిపిస్తుంటారు. రాయలసీమలోని ధర్మవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన బీజేపీ నేత సత్య కుమార్ యాదవ్ ఈ కోవలోకే వస్తారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న సత్యకుమార్ యాదవ్ స్వతహాగా జర్నలిస్టు కూడా. ఆయన తన నియోజకవర్గంలోని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఓ సాయం చేశారు.

Chandrababu s Cabinet Minister Steps Up Covers SSC Exam Fees for 1 000 Students

ధర్మవరం నియోజకవర్గంలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షల ఫీజును మంత్రి సత్యకుమార్ యాదవ్ తన సొంత డబ్బులతో చెల్లించారు. తద్వారా పేద విద్యార్ధులపట్ల తన అభిమానం చాటుకున్నారు. తాను ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.125 చొప్పున ఫీజును విద్యా శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం రూ.2,60,875 మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే,మంత్రి సత్యకుమార్ జిల్లా విద్యా శాఖ అధికారి ద్వారా చెల్లించారు.

Chandrababu s Cabinet Minister Steps Up Covers SSC Exam Fees for 1 000 Students

వీటి వివరాలను జిల్లా విద్యా శాఖ అధికారి సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియచేస్తూ ఉత్తర్వులిచ్చారు. బత్తలపల్లి, దర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 2,087 మంది పదో తరగతి చదువుతున్నారు. త్వరలో వీరంతా టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. విద్యార్థుల ఫీజును వారికి ప్రోత్సాహకరంగా, ప్రేరణగా ఉండేందుకు మంత్రి చిరు ప్రయత్నంచేశారని సన్నిహితులు తెలిపారు. లబ్ధిపొందిన వారిలో 1,096 మంది బాలికలు ఉన్నారు. మంత్రి చొరవను నియోజకవర్గ వాసులు స్వాగతిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+