చంద్రబాబు ఆరెంజ్ వ్యూహం వెనుక ? సర్వేలకు కౌంటర్ ప్లాన్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిందా లేదా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పనితీరు ఎలా ఉందన్న అంశాలపై పలు సర్వేలు వెలువడ్డాయి. వీటిలో కామన్ గా కనిపించిన విషయం చాలా చోట్ల ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్ధాయిలో లేదనేదే. అయితే ఇదే అంశంపై ఇప్పటికే పలుమార్లు కేబినెట్ భేటీల్లో సైతం చర్చించి హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు తాజాగా ప్లాన్ మార్చారు. అయితే దీని వెనుక ఓ కీలక కారణం కనిపిస్తోంది.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఓ విస్తృత భేటీ ఏర్పాటు చేశారు. దీనికి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మొత్తం మీద ఆహ్వానితుల్లో దాదాపు 60 మంది హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మీలో ఓ నలుగురితో ఇప్పటికే మాట్లాడటం ప్రారంభించానని కూడా చెప్పేశారు. దీంతో ఆ నలుగురిపై చర్చ మొదలైంది. వారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గా తేలింది.

Chandrababu s counter to survey reports begin repairs with orange zone mlas

అయితే తాజా సర్వేల్లో ఆరెంజ్ జోన్ లో కనిపించిన ఈ నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముందుగా ఎందుకు మాట్లాడారు ? వీరి కంటే దారుణంగా పనితీరు ఉన్న రెడ్ జోన్ లోని దాదాపు 50కి పైగా ఎమ్మెల్యేలతో ఎందుకు మాట్లాడలేదన్నచర్చ మొదలైంది. దీని వెనుక కారణం చంద్రబాబు సొంత సర్వేలే అన్న చర్చ జరుగుతోంది. కూటమి ఏడాది పాలన నేపథ్యంలో ఐవీఆర్ఎస్ తో పాటు ఇతర సర్వేలు కూడా చేయించిన చంద్రబాబు వాటి ఆధారంగా ముందుగా వీరితో మాట్లాడినట్లు తెలుస్తోంది. తద్వారా బయట సర్వేలను తాము నమ్మడం లేదనే సంకేతాల్ని చంద్రబాబు ఆయా ఏజెన్సీలకు పంపినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సర్వేల ఆధారంగానే తదుపరి చర్యలుంటాయన్న సంకేతాలను ఇచ్చినట్లయింది.

Chandrababu s counter to survey reports begin repairs with orange zone mlas

వాస్తవానికి చంద్రబాబు తాజాగా వన్ టూ వన్ మాట్లాడిన ఎమ్మెల్యేల్లో కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి సీనియర్లే. ఒక్క మిరియాల శిరీషా దేవి మాత్రమే తొలిసారి ఎమ్మెల్యే. సీనియర్లు అయిన వారు తమకు ఏమీ కాదులే అన్న భావనలో ఉన్నందునే ముందుగా వీరితో మాట్లాడి పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి మరికొందరు సీనియర్లతో మాట్లాడిన తర్వాతే సర్వేల్లో రెడ్ జోన్ లో ఉన్న ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+