చంద్రబాబు లేటెస్ట్ సర్వే..! డేంజర్ జోన్లో వీరే..! రిపోర్ట్ లో అనూహ్యంగా..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతోంది ?, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా జనం అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. వీటిలో మెజార్టీ వ్యక్తమైన అభిప్రాయం ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ వ్యక్దిగతంగా పలువురు ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని తేల్చాయి. ఇదే క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు చేయించిన ఓ సర్వే రిపోర్టు తాజాగా ఆయనకు అందినట్లు తెలుస్తోంది.
ఇందులో రాష్ట్రంలో తాజాగా కూటమి ఏడాది పాలన నేపథ్యంలో చేయిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తర్వాత జనం ఏమనుకుంటున్నారో ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై జరిపించిన ఈ సర్వేలో గతంలో వచ్చిన పలు సర్వేల తరహాలోనే 40 నుంచి 47 మంది కూటమి ఎమ్మెల్యేలపై బాగా వ్యతిరేకత ఉన్నట్లు తేలినట్లు సమాచారం. వీరంతా దాదాపు డేంజర్ లోనే ఉన్నారని చెప్తున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకూ ఈ సర్వే చేశారని తెలుస్తోంది.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తర్వాత ఈ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తల సంతృప్తి, మెజార్టీలు ఎంత తగ్గాయి, ప్రభుత్వ, ఎమ్మెల్యేల పనితీరుపై జనం అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఫోకస్ పెట్టారు. వీటిలో ప్రభుత్వ పనితీరు బాగుందని దాదాపు 60 శాతం మంది చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కనిపిస్తోందని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో 60 శాతం పైగా సానుకూలత ఉందని సర్వే లెక్కలు చెప్పినట్లు సమాచారం. అయితే గ్రౌండ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమైందని అంటున్నారు.

ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల వరకూ పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు సరి చేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులోపు మరో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజా రిపోర్టు ఆధారంగా వీరితో మాట్లాడి సరిచేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తాజాగా కేబినెట్లోనూ మంత్రుల పనితీరు మెరుగుపడినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications