బాలయ్య కు బాబు మార్క్ షాక్ - పవన్ ను ఫాలో కావాల్సిందే..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించిన విధంగానే టీడీపీ - జనసేన పొత్తు అధికారికం అయింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ ప్రకటించారు. ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ..లోకేశ్ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే బాలకృష్ణ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజల్లోకి వస్తానని చెప్పారు. కానీ, ఇప్పుడు పొత్తు వేళ పవన్ ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది. మరి..బాలయ్య పాత్ర ఏంటి.

టీడీపీలో మారుతున్న లెక్కలు : టీడీపీలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. సినిమా హీరోగా ఉన్న బాలయ్య తొలి నుంచి చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. 2014,2019 ఎన్నికల్లో హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా, పార్టీ విధాన పరమైన నిర్ణయాల్లో బాలయ్య పాత్ర తక్కువ. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ సమయంలో నందమూరి బాలకృష్ణ తొలి సారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ తో మరణించినట్లుగా చెబుతున్న వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. రాజమండ్రికి వెళ్లి పవన్, లోకేశ్ తో కలిసి చంద్రబాబును కలిసారు. ఆ తరువాత జైలు బయటే పవన్ టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రకటించారు. ఆ సమయంలో పవన్ పక్కనే ఉన్న బాలయ్య మౌనంగా వింటూ ఉన్నారు.

Chandrababus surprise directive to Balakrishna: Embrace Pawan Kalyans path

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పవన్ : ఒక విధంగా చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో డైలమా పరిస్థితి ఏర్పడింది. ఆశించిన వేగంగా పార్టీ నేతల నుంచి స్పందన లేదు. బాధ్యత తీసుకోవాల్సిన ముఖ్య నేతలు ముందుకు రాలేదు. లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోనే మకాం వేసారు. చంద్రబాబు జైలు నుంచి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా..అమలులో వేగం లేదు. ఇదే సమయంలో పవన్ జైలుకు వచ్చి చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. దీంతో, బాలయ్యను రాజమండ్రికి పిలిపించారు. బాలయ్య, లోకేశ్ ఇద్దరూ పవన్ తో జైలులో ములాఖత్ కు ప్లాన్ చేసారు. ములాఖత్ వెంటనే ఇప్పటి వరకు అధికారికం కాని పొత్తును అధికారికం చేసారు. బీజేపీ కలిసి వస్తుందని తమ అంచనాగా చెబుతూ..రావాలని పవన్ అప్పీల్ చేసారు. ఈ సమయంలో బాలయ్య ఎక్కడా స్పందించలేదు.

బాలయ్య రోల్ ఏంటి : ఇక, అటు జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పైనా స్పందించలేదు. పవన్ తో కలిసి వెళ్లే సమయంలో నందమూరి ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గకుండా ఈ సారి చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ తో పొత్తు ఖరారు పైన ప్రయత్నాలు చేస్తూనే..ముందుగానే అన్ స్టాపబుల్ ద్వారా పవన్ - బాలయ్య ఒకే వేదిక మీదకు వచ్చారు. వ్యూహాత్మకంగా ఈ కాంబోకు ఆదరణ దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ, రాజకీయ నిర్ణయాల్లో మాత్రం బాలయ్యకు ప్రాధాన్యత దక్కటం లేదనే అభిప్రాయం ఉంది. పవన్ పొత్తు ప్రకటన చేసి వెంటనే వెళ్లిపోయారు. ఈ ప్రకటన సమయంలో బాలయ్యకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. పవన్ ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారారు. ఫలితంగా నందమూరి హీరోలకు సొంత పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+