మోడీ కేబినెట్లో నలుగురు టీడీపీ మంత్రులు ! ముగ్గురి పేర్లు ఫైనల్ ?

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రధాని మోడీ మంత్రి పదవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా కీలక భాగస్వాములుగా మారిన టీడీపీ, జేడీయూతో పాటు మరికొన్ని పార్టీలకు అధిక బెర్తులు కేటాయిస్తున్నారు. దీంతో టీడీపీకి నాలుగు కేబినెట్ బెర్తులు దక్కవచ్చని తెలుస్తోంది. ఇందులో మూడు పేర్లను ఇప్పటికే చంద్రబాబు ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు టీడీపీకి నాలుగు కేబినెట్ బెర్తులు ఇచ్చేందుకు మోడీ అంగీకరించారు. ఇందులో మూడు పేర్లను ఖరారు చేశారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ చంద్ర మాథుర్ ఉన్నారు. వీరితో పాటు మరో మంత్రి పేరును ఖరారు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Chandrababu s tdp to get four cabinet ministers in modi s new cabinet three names finalized

వీరితో పాటు బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరికి కూడా కేబినెట్లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. దీంతో తుది జాబితా ఖరారు కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ రాత్రికి వీరి పేర్లను ఖరారు చేసి సమాచారం అందిస్తారు. రేపు రాత్రి 7 గంటల తర్వాత ఢిల్లీలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశీ అతిధుల్ని ఆహ్వానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+