సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ : టైమింగ్స్ మార్పు, సీట్లు పెంపు..!!
సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటం తో ప్రయాణీకుల వినతుల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు. ఈ నెల 17వ తేదీ నుంచి పెంచిన కోచ్ ల కారణంగా సీట్లు రెట్టింపు సంఖ్యలో అందు బాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రకటన చేసారు.
పెరిగిన ఆదరణ:సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించిన ఈ రైలుకు ప్రస్తుతం 8 కోచ్ లు ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది, మే మొదటి పది రోజుల్లో ఆక్యుపెన్సీ 134 శాతంగా ఉందని సమాచారం. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తిరుపతి ప్రయాణీకులకు ఏడున్నార గంటల్లోనే గమ్యానికి చేరుకొనే అవకాశం ఉండటంతో భారీగా స్పందన కనిపిస్తోంది.

17 నుంచి అందుబాటులో:ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోచ్ లు పెంచాలని కోరారు. ఈ మేరకు ఈ రైలులో 8 కోచ్ లు ఇక నుంచి 16 కోచ్ లు కానున్నాయి. ఈ నెల 17వ తేదీ నుంచి సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది. వారం మొత్తంలో మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు యధావిధిగా నడుస్తోంది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి పెరిగిన సీట్లతో పాటుగా టైమింగ్స్ లో స్వల్ప మార్పులతో రైలు నడవనుంది. ప్రయాణీకుల కోసం వందేభారత్ కోచ్ లు పెంచటం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
The 20701 SC-TPTY train will be departing 15 minutes later at 6:15 AM from Secunderabad station and arriving at Tirupati at the same time of 14:30
— G Kishan Reddy (@kishanreddybjp) May 14, 2023
The return train will start from Tirupati at 15:15 hrs and reach Secunderabad 15 mins earlier at 23:30 hrs.
2/2 pic.twitter.com/53dmWDerqc
టైమింగ్స్ లో స్వల్ప మార్పు:వందేభారత్ ప్రస్తుతం నడుస్తున్న టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చేసారు. ఉదయం 6గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు. అలాగే నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు 11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications