కొడాలి నాని ఫేక్ లెటర్‌తో 3.3 లక్షలకు టోపీ- పౌరసరఫరాలశాఖలో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో..
ఏపీలో నకిలీ లేఖల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంలో పలువురు మంత్రులు, అధికారుల పేరుతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతుండగా.. తాజాగా ఇదే కోవలో పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేరుతోనూ నిందితులు మోసానికి పాల్పడ్డారు. పౌరసరఫరాలశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.3.3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్ సృష్టించి ఉద్యోగం వచ్చినట్లు నమ్మించారు. మోసం బయటపడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పౌరసరఫరాల శాఖ పరిధిలోకి వచ్చే సివిల్ సప్లైస్ అండ్ కన్సూమర్ అఫైర్స్ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎగయ్య అనే యువకుడిని మోసం చేశారు. అతని నుంచి 3.3 లక్షలు తీసుకుని మంత్రి కొడాలి నాని ఓఎస్టీ పేరుతో ఓ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ సృష్టించారు. ఇందుల సంతకాలు, స్టాంపులు ఫోర్జరీ చేశారు. చివరికి సదరు యువకుడు అపాయింట్‌మెంట్ లేటర్ తీసుకుని ఆఫీసుకు వెళ్తే వీళ్ల బండారం బయటపడింది. దీంతో బాధితుడు ఎగయ్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారంలో అదే శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సతీష్ వర్మతో పాటు గుంటూరులోని వార్డు సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న సౌజన్య అనే యువతి, మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. సివిల్ సప్లై అధికారికి నకిలీ పత్రాలు పంపిన సతీష్ వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు పోలీసులు ప్రకటించారు.

-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications