ఏపీకి వణుకు పుట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్స్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లో చోరీ యత్నం; రంగంలోకి పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ దడ పుట్టిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో రెయిన్ బో విల్లాస్ లో చెడ్డీ గ్యాంగ్ దోపిడికి ప్రయత్నించిందని, నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకొని చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు ప్రయత్నిస్తోందని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో పాటు ఓ వ్యాపారికి సంబంధించిన విల్లాల తలుపులు పగలగొట్టిన చెడ్డీ గ్యాంగ్ లోపలికి చొరబడి అక్కడ డబ్బులు, ఆభరణాల కోసం వెతుకుతూ ఇళ్ళ లోపల ఉన్న వస్తువుల్ని చిందరవందర చేసిందని విలువైన వస్తువులు ఏవి లభించకపోవడంతో ముఠా వెనుదిరిగిందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

 ఏపీలో చెడ్డీ గ్యాంగ్స్ కలకలం .. ఏపీ వాసులకు భయం

ఏపీలో చెడ్డీ గ్యాంగ్స్ కలకలం .. ఏపీ వాసులకు భయం


ఇంతకు ముందు హైదరాబాద్ లో మాత్రమే కనిపించిన చెడ్డీగ్యాంగ్స్ , ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కలకలం రేపడం వరుస చోరీలకు పాల్పడడంతో ఏపీ వాసుల్లో ఈ గ్యాంగ్ పై భయం పట్టుకుంది. చెడ్డీలు,తలపాగాలు ధరించి, మారణాయుధాలను చేత్తో పట్టుకొని, అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత పది మంది గ్యాంగ్ తో ఈ గ్యాంగ్లు దోపిడీకి పాల్పడతారు. వీరు దోపిడీ చేసే సమయంలో అడ్డొస్తే ప్రాణాలు తీయడానికి అయినా వెనుకాడరు. కనీసం 10 మంది సభ్యులు ఉండే ఈ గ్యాంగ్ లు సిసి టివి ఫుటేజ్ లో మాత్రమే కనిపించి, పట్టుబడకుండా మాయమై పోతుంటారు.

శివారు ప్రాంతాలనే టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్స్

శివారు ప్రాంతాలనే టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్స్

ఎలాంటి ఇంటి తాళం అయినా ఒకే ఒక రాడ్డుతో చాకచక్యంగా తెరవగల నైపుణ్యం చెడ్డీ గ్యాంగ్ సొంతం. అంతేకాదు ఎక్కడైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, పక్కాగా రెక్కీ చేసి మరీ చోరీలకు పాల్పడ్డారు. తప్పించుకునే వ్యూహాన్ని కూడా ముందే సిద్ధం చేసుకొని దొంగతనాలకు దిగుతారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలలో ఉన్న ఇళ్లనే దోపిడీకి ఎంచుకుంటారు. ఇటీవల బెజవాడలో రెండు చోట్ల దోపిడీకి యత్నం చేసి బీభత్సం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ చిట్టినగర్, గుంటుపల్లి లో హైఫై అపార్ట్మెంట్లలో దొంగతనానికి ప్రయత్నించారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ కు దగ్గరే చెడ్డీ గ్యాంగ్ ల దోపిడీ యత్నం

సీఎం క్యాంప్ ఆఫీస్ కు దగ్గరే చెడ్డీ గ్యాంగ్ ల దోపిడీ యత్నం

ఆ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కు సమీపంలోని కూతవేటు దూరంలో రెయిన్ బో విల్లాస్ లో అలజడి సృష్టించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాలలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు చెడ్డీ గ్యాంగ్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ ఇంటిపై దాడి చేస్తారో అన్న ఆందోళనలో ఉన్నారు ఏపీ వాసులు. ఇటీవల ఒంగోలులో జరిగిన జంట హత్యలు కూడా చెడ్డీ గ్యాంగ్స్ పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దోపిడీకి ప్రయత్నించిన చెడ్డీ గ్యాంగ్స్ కోసం రంగంలోకి పోలీసులు

దోపిడీకి ప్రయత్నించిన చెడ్డీ గ్యాంగ్స్ కోసం రంగంలోకి పోలీసులు

ఇక ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠాను పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు సిసి టివి ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నగర శివారు విల్లాలలో, అపార్ట్మెంట్లలో చోరీకి ప్రయత్నించింది చెడ్డి గ్యాంగ్ లేనా? లేకా వారి పేరు చెప్పుకొని తిరుగుతున్న వేరే ముఠానా అని పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటానికి పోలీసులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏపీలో చెడ్డీ గ్యాంగ్స్ హల్చల్ చెయ్యటం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+