బైక్ అదుపు తప్పి చెన్నై మహిళా టెక్కీ దుర్మరణం

Chennai techie dies in Prakasam district
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్ మరణించింది. కొరశపాడు మండలం మేదరమెట్ల వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతురాలిని తమిళనాడు రాజధాని చెన్నైవాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం బోనువారిపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యువాత పడ్డారు. ఇదిలావుంటే, అనంతపురం జిల్లా గుత్తి శివారులోని సంకులమ్మ ఆలయం వద్ద కారు, ఆటో ఢీకోనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరిపాలెంలో కరెంట్ తీగెలు తెగి పడి మీద పడడంతో నిరుపేద కూలీ దంపతులు మరణించారు. వల్లూరిపాలెం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరమ్మ (40) శనివారం ఐదు గంటల సమయంలో ఇంటి ముందు కరెంట్ తీగెలు తెగిపడి ఉండడాన్ని గమనించి పక్కకు తొలగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆయన విద్యుద్ఘాతానికి గురై మరణించింది.

కాసేపటి తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చిన భరత్ విఘ్నేశ్వర రావు (45) ఇంటి ముందు వెంకటేశ్వరమ్మ పడి ఉండడాన్ని గమనించి ఆందోళనగా దగ్గరకు వెళ్లాడు. దీంతో అతను విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ దంపతులు ఇద్దరు పిల్లలున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+