ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల దాడిలో అనంతపురం జవాను మృతి
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన జవాను ఉన్నారు. జిల్లాలోని నల్లమాడ మండలం డెన్నికోటకు చెందిన జవాన్ రామ్మోహన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు సోమవారం గాలింపు చర్యలు చేపట్టి తిరిగి వస్తుండగా... సుకమా జిల్లా పరిధిలో చోటుచేసుుకన్న మావోయిస్టుల దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మావోయిస్టులు చేసిన అతి పెద్ద దాడుల్లో ఇది మొదటిది. మృతుల్లో ఇద్దరు అధికారులు, 14 మంది జవాన్లు ఉన్నారు. గత నెలలో సుక్మా జిల్లాలో జరిగిన సంఘటనలో గాయపడిన ఆరుగురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది, ఓ ఐఎఎఫ్ కమెండోను తరలిస్తుండగా నక్సలైట్లు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌పై దాడి చేశారు.
సోమవారం సంఘటన జరిగిన ప్రాంతం రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపటి నుంచి దండకారణ్యంలో మావోయిస్టులు అమర వీరుల వారోత్సవాన్ని తలపెట్టారు. సిఆర్‌పిఎఫ్ ఎదురు దాడి చేయకుండా ప్రజలను మావోయిస్టులు కవచాలుగా వాడుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications