జగన్ కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం ఫిక్స్ - మంత్రుల తాజా రిక్వెస్ట్ : సీఎం మాత్రం ఇలా..!!
ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఎప్పుడు. కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రధానంగా వినిపిస్తున్న డిస్కషన్ ఇదే. ప్రస్తుతం ఉన్న మంత్రులు తాము ఎంత కాలం ఇంకా పదవుల్లో ఉంటాయో తెలియదంటూ నైరాశ్యంలో కనిపిస్తున్నారు. తమకు మంత్రి పదవి ఖాయమని నమ్మకంతో ఉన్నవారు సీఎం ప్రకటన వైపు చూస్తున్నారు. 2019, జూన్ 8న జగన్ కేబినెట్ లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. వారిని మంత్రులుగా ఎంపిక చేసిన సమయంలోనే రెండున్నారేళ్లు మాత్రమే పదవుల్లో ఉంటారని సీఎం స్పష్టం చేసారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం వరకు మార్పులు తప్పవని చెప్పారు.

కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం పైన అంచనాలు
దీంతో..సీనియర్లు కొందరు కంటిన్యూ అవుతారనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 8కి మంత్రులు బాధ్యతలు చేపట్టి రెండున్నారేళ్లు పూర్తవుతుంది. దీంతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సీఎం సైతం వేగంగా అడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి తాజాగా ఒక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

మరో ఆరు నెలలు పొడిస్తారంటూ
కరోనా కారణంగా చాలా కాలం పాలనా వ్యవహారాల పైన ఫోకస్ చేయలేకపోయామని..తమకు మరో ఆరు నెలలు సమయం ఇవ్వాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. అయితే, కరోనా ఏపీకి మాత్రమే పరిమితం కాలేదని... అయినా, ఆ సమయంలోనూ మంత్రులుగానే కొనసాగారనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎం వారి వినతి పైన ఎటువంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. సీఎంకు ప్రస్తుత మంత్రులను మరో ఆరు నెలలు పొడిగించే ఆలోచన ఉంటే..ఖచ్చితంగా వారి వినతికి సానుకూలంగా స్పందించే వారంటూ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఆశావాహుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
ఇప్పుడున్న వారికి ఆరు నెలల కాలం పొడిగిస్తే..కొత్తగా వచ్చే మంత్రులు ఆరు నెలల సమయం తగ్గిపోతుందని..ఎన్నికల పేరుతో ఆరు నెలల ముందుగానే 2024 ఎన్నికలకు సిద్దం కావాల్సి ఉన్నందున వారికి ఏడాదిన్నార మాత్రమే పదవుల్లో కొనసాగే పరిస్థితి ఏర్పుడుతుందనేది మరో విశ్లేషణ. అయితే, మంత్రి బాలినేని ఇప్పుడున్న మంత్రులను పూర్తిగా తప్పించి..వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలకు సంబంధించి సంసిద్దత పైన మంత్రులకు సూచనలు చేసారు.

సీఎం జగన్ కసరత్తు ప్రారంభించారంటూ
ప్రశాంత్ కిషోర్ టీం వచ్చే ఏడాది నుంచే వైసీపీ కోసం పని చేసేందుకు వస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. ఎక్కడా మంత్రివర్గం విస్తరణ.. ఉన్నవారిని తప్పించటం వంటి అంశాల గురించి ప్రస్తావించలేదు. బాలినేని వ్యాఖ్యల పైనా రియాక్ట్ కాలేదు. దీంతో..బాలినేని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆచరణలో అమలు కాబోతున్నాయంటూ వైసీపీ నేతలు డిసైడ్ అయిపోయారు. కొద్ది రోజులుగా కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సైతం అదే విషయాన్ని పరోక్షం గా ఖరారు చేస్తున్నాయి.

గోదావరి-ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాధాన్యత
ఇక, సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా సీఎం జగన్ తన కేబినెట్ ప్రక్షాళన పైన ఇప్పటికే ప్రాధమికంగా కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రులు మారినా... సామాజికంగా మాత్రం ఎక్కడా లెక్క తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో చోటు చేసుకొనే రాజకీయ సమీకరణాలు..వాటి ప్రభావం పడే వర్గాలను పరిగణలోకి తీసుకొని సీఎం ప్రాధాన్యత ఇస్తారనం అంచనా వేస్తున్నారు. దీంతో...బీసీ-ఎస్సీ-ఎస్టీ-కాపు వర్గాలకు ఈ సారి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

టార్గెట్ 2024 లక్ష్యంగా సీఎం అడుగులు
అదే సమయంలో గోదావరి..ఉత్తరాంధ్ర కు కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మిషన్ 2024 పేరుతో రాజకీయంగా ఇప్పటి నుంచే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ముందుగానే సిద్దం అయ్యేందుకు సీఎం భారీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యహారాలకు సంబంధించి సీఎం జగన్ రేపు జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications