ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం: అబ్బాయి పుట్టాడని చెప్పి అమ్మాయిని ఇచ్చారు
గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులు మారిపోయారు. జి. అనిత, కె. అనిత అనే ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో ఒకేసారి పురుడుపోసుకున్నారు. వీరిద్దరిలో ఒకరు మగ శిశువు, మరొకరు ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
వీరిద్దరిలో ఎవరికి ఎవరు పుట్టారో చెప్పడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అక్కడ ఇద్దరి కుటుంబ సభ్యలకు మధ్య వివాదం తలెత్తింది. వివరాల్లోకి వెళితే, తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన జి. అనితకు మొదట అబ్బాయి పుట్టాడని చెప్పారు.

ఆ తర్వాత కె. అనిత అనే మహిళకు అమ్మాయి పుట్టిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. రెండు రోజులు గడచిన తర్వాత జి. అనితకు పుట్టింది అమ్మాయి అని అబ్బాయి కాదని చెప్పారు. దీంతో జి. అనిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
పురుడు సమయంలో అబ్బాయి పట్టుడాని చెప్పి, ఆ తర్వాత అమ్మాయిని ఇచ్చారని సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సూపరిండెంట్ విచారణకు ఆదేశించారు. ఇద్దరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, సాయంత్రం లోపు ఎవరికి ఎవరు పుట్టారనే దానిపై స్పష్టత ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందికి ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications