దేశమంతా సైనికులకు అండగా నిలవాలి
హైదరాబాద్: మన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదలను రెచ్చగొడుతోందని చినజీయర్ స్వామి బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అందరం జవాన్లకు అండగా నిలబడాల్సిన అవసరముందన్నారు.ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో వాజపేయి లాహోర్‌కు బస్సులో ప్రయాణించి ఇరుగుపొరుగు వారితో సఖ్యత సాగాలని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌తో కలిసి ఉండాలని అప్పుడు వాజపేయి యాత్ర చేశారన్నారు. ఆ యాత్ర పూర్తయ్యాక మన దేశానికి లభించిన బహుమతి కార్గిల్ యుద్ధం అన్నారు.ఇది అందరికీ తెలిసే ఉంటుందన్నారు. కార్గిల్ వార్ జరిగినప్పుడు దేశ రక్షణ కోసం పోరాడిన మన సైనికుల కోసం, వారి మనోధైర్యం కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో సికింద్రాబాదులోని బైసన్ పోలో మైదానంలో 80వేల మందితో ఓ కార్యక్రమం చేశామన్నారు. ఆనాడు దీపాలు వెలిగించామని చెప్పారు.












Click it and Unblock the Notifications