అమరావతి నీళ్లలో ఎయిర్ పోర్ట్ ! తల్లికి వందనంతో కుటుంబాల్లో చిచ్చు-చింతా మోహన్ షాకింగ్..!
ఏపీ రాజకీయాలపై, ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు చేసే నేతల్లో ఒకరైన మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి, కుప్పం, భోగాపురంలో కొత్త ఎయిర్ పోర్టులు కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కుటుంబాల్లో చిచ్చురేపుతోందని ఆయన విమర్శించారు.
విజయవాడలో విమానాశ్రయం ఉండగా.. 30 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో మరో విమానాశ్రయం ఎందుకని చింతా మోహన్ ప్రశ్నించారు. నీళ్లల్లో విమానాశ్రయం కట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. అమరావతిలో విమానాశ్రయం కట్టేందుకు టెక్నికల్ ఫీజు బులిటి లేదని ఇంజనీర్లే చెప్పారని గుర్తుచేశారు. తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉందని, వైజాగ్ లో మరో విమానాశ్రయం ఉందని, కుప్పంలో పేదరికం విపరీతంగా ఉన్నదని, పల్లెలకు బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేదని చంద్రబాబుకు తెలిపారు.

మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేని నిరుపేదలు కుప్పంలో 50 శాతం ఉన్నారన్నారు. అత్యంత పేదరికం ఉన్న కుప్పంలో విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఒక్కడికే రాను, పోను, కుప్పం విమానాశ్రయం కట్టాలనుకుంటున్నారని చింతా మోహన్ ఆక్షేపించారు. 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు. 5 వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించి అమరావతిలో విమానాశ్రయం కట్టడం వేస్ట్ అన్నారు. శ్రీకాకుళంలో వేలాదిమంది కూటిక లేక, తిరుపతిలో కూలి పనులకు వెళ్తున్నారని, శ్రీకాకుళం వాసులకు కావాల్సింది ఉపాధి హామీ పథకం అన్నారు. విశాఖలో ఎయిర్ పోర్ట్ ఉండగా, భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకన్నారు.

మరోవైపు తల్లికి వందనం పథకం భార్యాభర్తల మధ్య తగాదా పెడుతోందని చింతా మోహన్ ఆరోపించారు. తల్లికి వందనం డబ్బులు బ్రాందీ షాపులకు వెళ్తోందన్నారు. విద్యార్థులకు డబ్బులు ఉపయోగపడటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థి, విద్యార్థినులు చదువుకునే పాఠశాల, కళాశాలలకే నేరుగా డబ్బులు జమ అయ్యేదని, విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గమనించి, ప్రభుత్వం విద్యార్థులు చదువుకునే కళాశాలల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఏపీలో ప్రజాస్వామ్యం అద్వానంగా ఉందని చింతా మోహన్ ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కూడా గౌరవించే కలుపుకుని వెళ్ళామని, కూటమి ప్రభుత్వంలో మైక్ పర్మిషన్ ఇవ్వడానికి నెలలు తరబడి నాన్చుతున్నారని విమర్శించారు. ఐదు నిమిషాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మైక్ పెర్మిషన్లు ఇచ్చిందన్నారు. నెల్లూరులో జగన్ పర్యటనకు హెలికాప్టర్అనుమతి ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని చింతా ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications