మొగల్తూరు మండల గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదర్శ గ్రామం కింద పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం (దక్షిణ) గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎంపీ నిధులతో ఈ గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాగునీరు, ప్రాథమిక వైద్యసేవలు, గృహసౌకర్యం, కల్పించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చిరంజీవి ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఏపీలోని పలు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

సచిన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ గోదావరి జిల్లాలోని పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇటీవల వారు తాము దత్తత తీసుకున్న గ్రామాలను సందర్శించారు.
రెండు రోజుల క్రితం సచిన్ పీఆర్ కండ్రి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించారు. ఆయనకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ఫోన్ చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు సచిన్‌ను చంద్రబాబు అభినందించారు. అక్కడ కార్యక్రమాలు జరిగిన తీరు పైన ఆరా తీశారు. కుగ్రామాన్ని సచిన్ దత్తత తీసుకోవడం తనకు ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
తాను దత్తత గ్రామాల్లో పురుషులు మద్యం తాగి ఆడవాళ్లను కొట్టినట్లు తెలిస్తే ఢిల్లీ నుండి వచ్చి మహిళల తరఫున పోరాడుతానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆమె ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మడంలంలో తన దత్తత గ్రామాలు అయిన తూర్పు తాళ్లు, పెద్దమైనవానిలంక గ్రామాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications