చిరంజీవి విశ్వంభరుడు: పుట్టినరోజున పైకెత్తేసిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈ రోజు. పుట్టినరోజు సందర్భంగా పద్మ విభూషణుడికి అటు సినీ ప్రముఖుల నుండి ఇటు రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు చిరంజీవి కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు చిరంజీవి యొక్క జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు.
చిరంజీవికి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు
సినిమా, ప్రజా జీవితం, దాతృత్వం లో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చింది అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. మీ దాతృత్వం అంకితభావంతో మీరు జీవితాలను కృషి చేయడం కొనసాగించాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. మీకు మంచి ఆరోగ్యం ఆనందంతో పాటు రాబోయేవి అన్ని అనేక చిరస్మరణీయ సంవత్సరాలు కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

జీవితం వెలకట్టలేని జీవిత పాఠం: పవన్ కళ్యాణ్
ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవిగా ప్రేక్షకులను రంజింపజేసి ధ్రువ తారగా వెలుగొందుతున్న మా అన్నయ్యకు ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఆయన జీవితం వెలకట్టలేని జీవిత పాఠం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి ఎందరికో స్ఫూర్తినిచ్చారన్నారు.
పట్టుదల ఆయన నుండే తను నేర్చుకున్నానన్న పవన్ కళ్యాణ్
ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం తనకే కాదు తనలాంటి ఎందరికో స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చిరంజీవి ఏ రోజు విజయాలకు పొంగి పోలేదు విమర్శలకు కుంగిపోలేదు అని పేర్కొన్నారు. విజయాన్ని వినమ్రతతో, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుండే తను నేర్చుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఆయన తమ్ముడిగా పుట్టడం అదృష్టం అయితే ఆయన కష్టాన్ని చిన్నప్పటినుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవమని చెప్పారు.
చిరంజీవి విశ్వంభరుడు
అన్నింటినీ భరించే శక్తి ఆయన నైజమని అందుకే ఆయన విశ్వంభరుడు అంటూ కొనియాడారు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షు తో కూడిన మనసారా కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య మీద ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications