హైదరాబాద్ రావాల్సిన నార్వే జర్నలిస్ట్ వీసాను ఉన్నపళంగా రద్దు చేసిన కేంద్రం

హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిన నార్వేకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్‌కు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. చివరి నిమిషంలో ఆమె వీసా రద్దు చేసింది. నార్వే నుంచి భారత్‌కు బయలుదేరాల్సిన సమయానికి సరిగ్గా కొద్ది గంటల ముందు ఆమెకు అనుమతి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. రాజకీయంగా దుమారం రేపుతోంది.

హైదరాబాద్ లో నేటి నుంచి 14వ తేదీ వరకు భారత్ సమ్మిట్ జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్నినిర్వహిస్తోంది. ఇందులో మీడియా భవిష్యత్తు, పత్రికా స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై చీఫ్ ప్యానెలిస్ట్‌గా హెలె లింగ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సదస్సులో ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్ అనే అంశంపై అంతర్జాతీయ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనడానికి హెలె లింగ్ ప్రత్యేకంగా ఆహ్వానం పొందారు. నార్వేలోని భారత రాయబార కార్యాలయం ఆమెకు వీసా సైతం జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు కూడా పొందారు.

Norwegian journalist Helle Lyng who was all set to travel to Hyderabad had her Indian visa cancelled

ఈ ఉదయం నార్వేలో విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ఆదేశాల వల్ల ఆమె వీసా రద్దయింది. తన పర్యటన ఆకస్మికంగా రద్దు కావడంతో హెలె లింగ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఓస్లోలోని భారత ఎంబసీ అధికారులు వీసా ప్రక్రియ సమయంలో ఎంతో మర్యాదగా ప్రవర్తించారని, ఎంతో సాయపడ్డారని పేర్కొన్న ఆమె, ఎంబసీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు.

బంగారం ధరలు ఢమాల్.. భారీ పతనం
బంగారం ధరలు ఢమాల్.. భారీ పతనం

ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల వల్లే తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ఈ వీడియోను ఆ శాఖ మంత్రి అమిత్ షా కు ట్యాగ్ చేశారు. చివరి నిమిషంలో ఎందుకు వీసాను రద్దు చేయాల్సి వచ్చిందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ముందుగానే వీసా ఇవ్వకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక రద్దు కావడం, ఈ విషయంలో ఏకంగా హోమ్ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.

మారుతున్న యూపీ రాజకీయ ముఖచిత్రం- థర్డ్ ఫ్రంట్
మారుతున్న యూపీ రాజకీయ ముఖచిత్రం- థర్డ్ ఫ్రంట్

తన వద్ద చెల్లుబాటు అయ్యే వీసా డాక్యుమెంట్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించాలనుకునే అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఆధారాలుగా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని హెలె లింగ్ తెలిపారు. డాక్యుమెంట్స్ చెల్లుబాటు కావట్లేదనే కారణాన్ని చూపించే అవకాశాలు లేకపోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ వీసా రద్దు వెనుక ఉన్న నిర్దుష్ట కారణాలు ఏమిటనే దానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన గానీ, వివరణ గానీ వెలువడలేదు.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వేలో పర్యటించినప్పుడు హెల్లె లింగ్ వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ కు సంబంధించిన ఓ అంశంపై ఆమె నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇవ్వకుండా ప్రెస్ మీట్ నుంచి బయటికెళ్లిపోయారు. ఆ తర్వాత ఇది పెద్ద ఎత్తున డిబేట్స్ కు దారి తీసింది అప్పట్లో. ఆ కారణంతోనే హెల్లె లింగ్ విసా రద్దయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ తృణమూల్ కాంగ్రెస్ లోక్ సభ సభ్యురాలు మహువా మోయిత్రా ఘాటుగా స్పందించారు. ఒక విదేశీ ప్రతినిధికి అధికారికంగా వీసా మంజూరు చేసిన తర్వాత, చివరి నిమిషంలో ప్రయాణాన్ని అడ్డుకోవడం ఒక పార్లమెంట్ సభ్యురాలిగా తనకు సిగ్గుచేటుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ నార్వే ప్రభుత్వం భారత ప్రజాప్రతినిధులకు గానీ, ఇక్కడి పౌరులకు గానీ ఇలాంటి పరిస్థితి కలిగిస్తే కేంద్రం దౌత్యపరంగా ఎలా స్పందిస్తుందో ఆలోచించాలని నిలదీశారు.

నార్వేలో భారత రాయబార కార్యాలయం ఈ అంశాన్ని విదేశాంగ, హోమ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి అధికారికంగా తీసుకెళ్లాలని మహువా మోయిత్రా సూచించారు. భారత్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగించడానికి వచ్చే విదేశీ నిపుణులకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావడం దౌత్యపరంగా దేశ ప్రతిష్టకు ఏమాత్రం మంచిది కాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+