డీలిమిటేషన్ బిల్లు పై విపక్షాలకు ఊహించని ట్విస్ట్, కేంద్రం అనూహ్య నిర్ణయం.!!
కేంద్రం మరో సంచలన నిర్ణయానికి సిద్దమైంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. విపక్షాలు అంచనాలకు అందని లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒక సారి పార్లమెంట్ లో భంగపడిన కేంద్రం.. ఈ సారి పక్కా లెక్కలతో ముందుకు వెళ్తోంది. కావల్సిన లెక్కలు సెట్ చేసుకుంది. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన... డీలిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా ఢిల్లీ కేంద్రంగా అనూహ్య నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి.
మోదీ సర్కార్ కొత్త వ్యూహాలు సిద్దం చేసింది. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం వేగంగా కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వంలోని ముఖ్య నేతలు మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అదే విధంగా సమావేశాలకు ఐదారు రోజుల ముందు అంటే ఈ నెల 25 లేదా 26న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ కాకపోవడంతో ఈ నెలాఖరులో జరిగే సమావేశాలు వర్షాకాల సమావేశాలుగానే కొనసాగుతాయని... ప్రత్యేకంగా శీతాకాల సమావేశాలు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 18 వరకు పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం.

కావాల్సిన మద్దతు కూడగట్టిన కేంద్రం..!
కాగా, ఈసారి పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టి పరిస్థితు ల్లోనూ ఆమోదం పొందేా భారీ వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. వివిధ పార్టీలతో బీజేపీ సీనియర్లు అంతరంగిక చర్చలు ఇప్పటికే పూర్తిచేసినట్టు సమాచారం. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తోపాటు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కూడా నియోజకవర్గాల పెంపు నకు సుముఖంగా ఉన్నాయని.. డీఎంకే కూడా కొన్ని షరతులతో సుముఖత వ్యక్తం చేసిందని చెబుతున్నారు. దీంతో.. కేబినెట్ ప్రక్షాళనలో ఎన్సీపీకి అవకాశం దక్కటం ఖాయమని తెలుస్తోంది. విజయ్ తో కాంగ్రెస్ కలవటంతో గుర్రుగా ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ కొన్ని షరతులతో బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీంతో.. కేంద్రం అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ తొలి వారంలో మహిళా రిజర్వేషన్లు - డీ లిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టటం ఖాయంగా కనిపిస్తోంది. తుది ఫలితం పైనా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications
