భూమా నాగిరెడ్డి మృతిపై చిరంజీవి, అఖిలప్రియతో మాట్లాడిన జగన్
భూమా నాగిరెడ్డి మృతి ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
నంద్యాల: భూమా నాగిరెడ్డి మృతి ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
అఖిలప్రియతో మాట్లాడిన జగన్, విజయమ్మ
భూమా నాగిరెడ్డి కూతురు, ఎమ్మెల్యే అఖిల ప్రియతో వైసిపి అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫోన్లో మాట్లాడారు.

ఆళ్లగడ్డకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆళ్లగడ్డకు వెళ్తున్నారు. భూమా మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
అంత్యక్రియల్లో చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. భూమా నాగిరెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
భూమా మృతితో ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆయన కుటుంబానికి, తమ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications