చిరంజీవికి ఇష్టమైన పొలిటికల్ లీడర్ - స్వయంగా వెల్లడి : బీజేపీ ఇక ఆగేనా..!!

మెగాస్టార్ చిరంజీవి మరో ఆసక్తి కర అంశాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ఇది రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. చిరంజీవి ఇప్పుడు గాడ్ ఫాదర్ సక్సెస్ మూడ్ లో ఉన్నారు. 'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు'.. అంటూ చెప్పిన మెగా డైలాగ్ సినిమాలోనే కాదు, రాజీకయంగానూ మెగా డిబేట్ కు కారణమైంది. ఆ తరువాత సినిమా ముందు కూడా పవన్ కళ్యాణ్ కు తన మద్దతుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తన తమ్ముడు రాజకీయంగా సక్సెస్ అవ్వటం కోసమే తాను రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయ్యనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు ఇష్టమైన రాజకీయ నేతల పేర్లు స్వయంగా వెల్లడించటంతో, మరో సారి మెగా పొలిటికల్ డిస్కషన్ మొదలైంది.

రాజకీయంగా ఆసక్తి కర వ్యాఖ్యలు

రాజకీయంగా ఆసక్తి కర వ్యాఖ్యలు

చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు - కాంగ్రెస్ తో విలీనం తరువాత కేంద్ర మంత్రి అయ్యారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తరువాత కాంగ్రెస్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ..ఆయనకు కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ కార్డు జారీ చేయటం కొత్త చర్చకు కారణమైంది. చిరంజీవి కాంగ్రెస్ కు దూరంగా ఉన్నా..పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు. ఇదే సమయంలో ఆయన తాజాగా దర్శకుడు పూరీ జగన్నాధ్‌ తో ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రమ్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పూరీ రాజకీయాల గురించి ప్రశ్నించారు. రాజకీయాల్లో చిరంజీవికి ఇష్టమైన లీడర్ ఎవరని ప్రశ్నించారు. దీనికి చిరంజీవి ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఈ జనరేషన్ అంటే తన దగ్గర ఆన్సర్ లేదన్నారు. తాను ఈ ప్రశ్నకు సైలెంట్ గా ఉండిపోయేవాడినని చెప్పారు.

ఆ ఇద్దరు నేతలంటే ఇష్టమంటూ

ఆ ఇద్దరు నేతలంటే ఇష్టమంటూ

కానీ పాత జనరేషన్ అంటే మాత్రం చాలా మంది మహానుభావులు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. వారు అనేక పార్టీల్లో ఉన్నవారని వివరించారు. తనకు అవగాహన ఉన్నంత వకు లాల్ బహదూర్ శాస్త్రి పేరు ప్రస్తావించారు. మహానుభావుడాయన అని కొనియాడారు. ఆయన సింప్లిసిటీ, తన జీవితాన్ని దేశ శ్రేయస్సు కోసం అర్పించిన మహానుభావుడని కీర్తించారు. మహాత్మాగాంధీగారిని ఎలా అయితే అనుకుంటామో.. అదే రోజు పుట్టిన శాస్త్రిగారిని గొప్ప రాజకీయ నాయకుడిగా నేను ఇష్టపడుతుంటానని చిరంజీవి చెప్పారు. ఆ తరువాత రియల్ స్టేట్స్‌మెన్ అటల్ బిహారీ వాజపేయి అని వెల్లడించారు. ఆ ఇద్దరి నేతలను తాను గొప్ప రాజకీయ నాయకులుగా చూస్తుంటానంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఆ నేతల నేతృత్వంలో దేశం చాలా పురోగతిని సాధించిందని చెప్పారు.

బీజేపీ నేతలు ఇక ఆగుతారా

బీజేపీ నేతలు ఇక ఆగుతారా

జాతీయ రహదారులకు నేడు ఇంత క్రెడిట్ వచ్చిందంటే..ఖచ్చితంగా వాజపేయి గొప్పతనమే అంటూ మెగాస్టార్ కొత్త చర్చకు కారణమయ్యారు. బీజేపీ నేతలు ఇప్పిటికే చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ అనేక ప్రతిపాదనలు చేసారు. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలో మరోసారి బీజేపీ నేతలు తమ ప్రయత్నాలు ప్రారంభించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, జనసేన - బీజపీ పొత్తు కొనసాగుతోంది. గతంలో సోము వీర్రాజు తనను కలిసిన సమయంలోనే.. పవన్ కు మంచి భవిష్యత్ ఉందని- తమ్ముడితో కలిసి పని చేయండని సూచించారు. చిరంజీవి తనకు ఇష్టమైన నేతల్లో ప్రస్తుతం జాతీయ స్థాయిలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎవరి పేరు ప్రస్తావించకుండా వివాదానికి దూరంగా ఉన్నా.. ఇప్పుడు వాజపేయి పేరు ప్రస్తావనతో బీజేపీ నేతలు ఇక ఆగుతారా అనేదే ఇటు సినీ ఇండస్ట్రీ..అటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+