జగన్‌పై ఘాటుగా చిరు: ఆశ్యర్యపోయా, పవన్‌వల్ల కాదు

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని చెప్పారు. విభజనకు అన్ని పార్టీలు బాధ్యులేనని, నెపాన్ని కాంగ్రెసు పైకి నెట్టివేశారని, ఇదే విషయాన్ని తాము ప్రజల్లోకి తీసుకు వెళ్తామని, పార్టీకి పూర్వ వైభవం ఖాయమన్నారు. విభజన అనంతరం ఎపికి ప్రత్యేక హోదా దక్కబోతుందన్నారు. పలు విద్య, వైద్య సంస్థలు వస్తాయన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతామని తెలిపారు.
క్విడ్ ప్రోకో విధానంలో తక్కువ సమయంలో వేల కోట్లు దోయవచ్చునని జగన్ ప్రపంచానికి చాటారని ఎద్దేవా చేశారు. కేసుల నుండి జగన్ తప్పించుకోవడం అసాధ్యమన్నారు. తప్పించుకున్నాడే అనుకుంటే... ఎవరైనా అవినీతి చేయవచ్చుననే భావన అందరిలోను కలుగుతుందన్నారు.
వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెసు పథకాలే అన్నారు. వాటిని జగన్ తన సొంతం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. వైయస్ చనిపోయిన సమయంలో సంతకాల సేకరణ కోసం కొందరు వస్తే... ఇది సమయం కాదని చెప్పి పంపించానన్నారు. జగన్ తన ఆస్తులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారన్నారు.
పవన్ జనసేన నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ రాజకీయ ఆలోచనలు తనతో పంచుకోలేదన్నారు. తాను ఏం చేస్దే అదే అన్నారని అయితే, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలనే భావావేశం మాత్రం పవన్‌లో ఉందన్నారు. జనసేన గురించి పూర్తిగా తెలుసుకోకుండా తాను ఏమీ మాట్లాడలేనన్నారు. కాంగ్రెసు పార్టీని లేకుండా చేస్తానంటే అది అసాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications