కాంగ్ పెద్దలపై చిరంజీవికి కోపమొచ్చింది, కెవిపికి డిగ్గీ నో

ఆదాయ పంపిణీ, విద్యా సంస్థలు, హైదరాబాద్ కేంద్రపాలితం, పోలవరంపై ఏం చేస్తున్నారో చెప్పలేదని, ప్రజల్లో ఆకాంక్షలుంటాయని, తమకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలని వ్యాఖ్యానించారట. అంతా ఏకపక్షంగా చేశారని ఆరోపించారట. హైదరాబాద్‌తో అనుబంధం లేనందునే 1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు పరిస్థితి వేరని వివరించారని తెలుస్తోంది. 1972లోనే రాష్ట్రాన్ని విభజించాల్సిందని ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయడం కానీ, యుటి తరహా పాలన నడపడంకానీ కుదరదని కాంగ్రెసు పార్టీ పెద్దలు స్పష్టం చేశారట. ఇతరత్రా అంశాలకు సంబంధించి ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోక్యం చేసుకోగా.. ఆయనను మాట్లాడనివ్వండని దిగ్విజయ్ నిలువరించారట. సీమాంధ్రకు ఏం ఇచ్చుకున్నా అభ్యంతరం లేదని, తమకు మాత్రం రాష్ట్రం కావాలని తెలంగాణ నేతలు పేర్కొన్నట్లుగా సమాచారం.
గతంలో అధిష్ఠానం అనుమతి తీసుకునే తెలంగాణకు వ్యతిరేకంగా రాజ్యసభలో మాట్లాడానని, ఇప్పుడు కూడా అనుమతిస్తే బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడతానని కెవిపి రామచంద్ర రావు చెప్పారు. దానికి దిగ్విజయ్ సింగ్ నో చెప్పారు. వార్‌రూమ్‌లో పోలవరం ప్రాజెక్టుపై చాలాసేపు చర్చ జరిగినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications