ధైర్యం చెప్పేందుకే టూర్: చిరంజీవి, సిఎం ఏరియల్ సర్వే
విశాఖ/విజయనగరం: ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తన పర్యటన అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం అన్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. బాధితులను తప్పనిసరిగా ఆదుకుంటామని చెప్పారు. ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే తన పర్యటన అని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరద రాజకీయం చేయడం తగదన్నారు. ఆయన ఉదయం హైదరాబాదు నుండి విశాఖకు వచ్చారు.

ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ఆ జిల్లాల్లో చేపడుతున్న సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తారు. పంట నష్టపోయిన ప్రాంతాల్ని సందర్శిస్తారు. చిత్తూరు జిల్లా అధికారులతో కిరణ్, విజయనగరం జిల్లా అధికారులతో పిసిసి చీఫ్ బొత్స వరద ప్రభావంపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
తూర్పు గోదావరిలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. బాబు పర్యటన తుని, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో ఉంటుంది.












Click it and Unblock the Notifications