కారులో పథకం పన్నిన చంద్రబాబునాయుడు?

తెలుగుదేశం పార్టీ శ్రేణులు పుంగనూరులో ఎలా రెచ్చిపోయి వ్యవహరించారో రాష్ట్రమంతా చూసింది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ఆదేశాలతోనే టీడీపీ మూకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ పుంగనూరులో జరిగిన దాడి ఘటనలో పథకం ప్రకారమే కొందరు పోలీసులపై దాడికి దిగారని, టీడీపీ అల్లరి మూకలు విచక్షణా రహితంగా దాడిచేశాయన్నారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ ఎడమ కంటిచూపు పోయిందని, 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ప్రతి కుటుంబానికి సీఎం జగన్ అండగా ఉంటానన్నారని, చూపు కోల్పోయిన రణధీర్ కు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని ఎస్పీ తెలిపారు.

chittoor district punganur constituency incident update

పుంగనూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. విధ్వంసం సృష్టించాలనే కుట్రను చంద్రబాబు రచించారని, ఎస్పీ రిషాంత్ రెడ్డి ఎంతో సంయమనంతో వ్యవహరించారరని, మదనపల్లి నుంచి చల్లా బాబు, చంద్రబాబు ఒకే కారులో ప్రయాణిస్తూ దాడికి పథకం పన్నినట్లు చెప్పారు. జగన్ పై నిందలు వేయడానికి ముందస్తుప్రణాళికతోనే దాడులు చేశారని ఆరోపించారు. కాల్పులు జరపకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించారని కొనియాడారు. చంద్రబాబును ఏ1గా చేర్చాలని సూచించారు.

chittoor district punganur constituency incident update

చంద్రబాబు పర్యటనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశ పూర్వకంగానే పోలీసులపై దాడిచేసి గాయపరచడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టినట్లు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.శ్రీలక్ష్మి చెప్పారు. చంద్రబాబు పర్యటనలో రూట్ మ్యాప్ ను కాదని పుంగూరులోకి దౌర్జన్యంగా వస్తున్న టీడీపీ నాయకులను కార్యకర్తలను నివారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. మద్యం బాటిళ్లు, రాళ్లు, కర్రలతో దాడిచేసి పోలీసులను తీవ్రంగా గాయపరిచారని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనకు కారకులైన 62 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+