న్యాయ విచారణ జరపాల్సిందే: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం
హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించడమే సరైందని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సి) అభిప్రాయపడింది. శేషాచలం అడవుల్లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఇరవై మంది హతమైన సంఘటనా స్థలాన్ని కూడా మానవ హక్కుల సంఘం బృందం పరిశీలించనుంది. ఏప్రిల్ 7వ తేదీన 20 మంది పోలీసు కాల్పుల్లో హతమైన పరిస్థితిని బృందం అంచనా వేయనుంది.
ఎన్‌హెచ్ఆర్‌సి గురువారం విచారణ జరిపింది. ఇటువంటి సంఘటనల్లో న్యాయ విచారణ జరిపించిండం తప్పనిసరి అని అభిప్రాయపడింది. రెవెన్యూ అధికారులతో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

వెహికిల్ లాగ్ బుక్స్ వంటి సంఘటన స్థలంలోని వివరాలను నిల్వ చేయాలని బాలకృష్ణన్ ఆదేశించారు. సంఘటనకు సంబంధించిన వైర్‌లెస్ సమాచార వినిమయానికి సంబంధించిన వివరాలను కూడా అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
గాయుపడిన పోలీసుల వైద్య చికిత్సకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కూడా ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications