అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన సీఎం, సొంత జిల్లాలో తడిచిపోయింది, ఆ రోజుల్లో ?
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను క్కొక్కటిగా బయటకు తీయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో చిత్తూరులో, ఆయన సొంత నియోజక వర్గం కుప్పంతోపాటు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన అక్రమ లేఔట్లు, వెంచర్ల గురించి పూర్తి సమాచారం సేకరించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
అధికారులకు పూర్తి స్వేచ్ఛ రావడంతో కొంతకాలంగా అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కొందరు వైసీపీ నాయకులకు దడ మొదలైందని తెలిసింది. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రెండు మూడు సంవత్సరాల క్రితం ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూములు కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు విక్రయించిన కొందరు వైసీపీ నాయకులకి గుండె గుబేల్ మంటుంది. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు డీకేటీ భూముల ఆక్రమించుకొని వెంచర్లు వేసి వాటిని విక్రయించిన కొందరు వైసీపీ నాయకులు మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్దం అయ్యారు.

ఆ వెంచర్లలో, అక్రమ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మ్మల్ని మోసం చేశారని అధికారులకు ఫిర్యాదులు చేయడానికి సిద్దం అయ్యారని సమాచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, కుప్పం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలలోని కొందరు నాయకులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరెవరు వెంచర్ల వేశారు, ఏ సంవత్సరంలో ఆ భూమిని వాళ్లు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఎంతమందికి ఫ్లాట్లు విక్రయించారు అని సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.
పంచాయితీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ అధికారుల సూచనలు, సలహాలు ఏమాత్రం పట్టించుకోకుండా గత వైసీపీ ప్రభుత్వంలో వెంచర్లు వేసి వాటిలో ఫ్లాట్లు విక్రయించిన వారి వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన వెంచర్లు, అక్రమ లేఔట్లు ఏర్పాటు చేసిన వారి వివరాలను సంబంధిత అధికారులు సేకరిస్తున్నారు.

నియమాలకు విరుద్ధంగా అధికారుల దగ్గర ఇలాంటి అనుమతి తీసుకోకుండా పుట్టుకొచ్చిన వెంచర్లకు సహాయ సహకారాలు అందించకూడదని అధికారులు నిర్ణయించారు. అక్రమ లేఔట్లు, వెంచర్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వకూడదని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అక్రమ లేఔట్లు, వెంచర్లలో ఇల్లు నిర్మిస్తున్న వారికి రుణాలు మంజూరు చేయకూడదని బ్యాంకు అధికారులకు సూచించారు. పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఔట్ల దగ్గర ఇవి అక్రమ లేఔట్లు అంటూ అధికారులు బోర్డులు నాటుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి 10% నుండి 20% కమిషన్ తీసుకుని వారు వేస్తున్న కొత్త వెంచర్లకి, అక్రమ లేఔట్లకు అనుమతి ఇవ్వాలని సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా అక్రమా లేఔట్లపైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ లేఔట్ లు ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఇప్పుడు గుబులు మొదలైంది.












Click it and Unblock the Notifications