కర్నూలు కాకుండా బెజవాడ అయితే, అందుకే హైదరాబాద్: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయిన సమయంలో కర్నూలును రాజధానిగా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశం బ్యారేజీ నిర్మించి 60 వసంతాలు పూర్తైన సందర్భంగా శనివారం విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించిన తర్వాతే ఈ ప్రాంతంలో కరువు సమస్య తీరిందని గుర్తుచేశారు

 కర్నూలును రాజధానిగా చేయాల్సింది కాదు..

కర్నూలును రాజధానిగా చేయాల్సింది కాదు..

మద్రాస్‌ నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలును రాజధానిగా చేసి ఉండాల్సింది కాదని ఆయన అన్నారు. విజయవాడ రాజధాని అయి ఉంటే రాష్ట్రం అద్భుతంగా ఉండేదదని ఆయన అన్నారు.

 అందుకే రాజధానిగా హైదరాబాద్

అందుకే రాజధానిగా హైదరాబాద్

ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత తెలుగువాళ్లంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే పెద్దలు హైదరాబాద్‌ను రాజధాని చేశారని చంద్రబాబు అన్నారు.

 అది పవిత్ర సంగమం.

అది పవిత్ర సంగమం.

ప్రస్తుతం బ్యారేజీ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కృష్ణా-గోదావరి కలయిక ఒక పవిత్ర సంగమమమని, దానికోసం తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది కాలంలోనే నిర్మించి రికార్డు సృష్టించామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత రాష్ట్రంగా చేయాలన్నదే తన ధృఢసంకల్పమని అన్నారు.

 మాజీ ఇంజనీర్లకు చంద్రబాబు సత్కారం...

మాజీ ఇంజనీర్లకు చంద్రబాబు సత్కారం...

ప్రకాశం బ్యారేజీకి 60 వసంతాలు పూర్తైన సందర్భంగా బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకుని అసువులు బాసిన ఇంజనీర్లకు చంద్రబాబు నివాళులు అర్పించారు. బ్యారేజీ నిర్మా ణంలో వివిధ హోదాల్లో పాలు పంచుకుని వృద్ధులైన ఇంజనీర్లను సన్మానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anddhra Pradesh CM Nara Chandrababu Naidu opined that Vijayawada should be the Andhra capital.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి