సాక్షి ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆశ్చర్యం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ చానెల్ ప్రసారాల నిలిపివేతపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రసారాల పునరుద్ధరణకు తమ పరిధిలో చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు.
ఎంఎస్ఓలపై ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలను నిలివేసిన వైనంపై ఢిల్లీలోని తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృంధం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వినతిపత్రాన్ని అందించింది.
ప్రజల ఆందోళనలను ప్రసారం చేస్తోందనే కక్షతో ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాక్షి ప్రసారాలను ప్రభుత్వం నిలిపేసిందని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛనూ పత్రికా స్వేచ్ఛనూ హరించడమేనని ప్రతినిధి బృందం ఆరోపించింది. గతంలో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమిటీ వేసిందని ప్రతినిధి బృందం గుర్తు చేసింది. అన్ని అంశాలనూ పరిశీలిస్తామని జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ హామీ ఇచ్చారు.

చంద్రమౌళి ప్రసాద్ కుమార్‌ు కలిసి ప్రతినిధి బృందంలో కొమ్మ కైలాస్ (ఆంధ్రభూమి), ఎన్. విశ్వనాథ్ (నమస్తే తెలంగాణ), లెంకల ప్రవీణ్ కుమార్ (సాక్షి), నాగిళ్ల వంకటేశ్ (సాక్షి టీవీ), గాంధారి దీపక్ రెడ్డి (మన తెలంగాణ), ఆడబాల రాము (ఆంధ్రభూమి, జగదీష్ జరజాపు (ప్రజాశక్తి), గోపీకృష్ణ (10టీవీ), వి. తిరుపతి (టీన్యూస్), కిశోర్ (వీ6), మదార్ (హెచ్ఎంటివి), భరత్ సింహారెడ్డి (ఐఎన్ఎస్ఎస్) తదితరులు ఉన్నారు.
ప్రజా ఉద్యమాలను, ప్రసార మాధ్యమాలను అణచివేయడం అప్రజాస్వామికమని కొమ్మ కైలాస్ ఈ సందర్భంగా విమర్శించారు .ప్రజాందోళనల ద్వారా ప్రభుత్వం ప్రజానాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని, అందుకు ప్రసార మాధ్యమాలను వాడుకోవాలని ఆయన అన్నారు. అంతేతప్ప మీడియాపై వివక్ష సరైంది కాదని ఆయన అన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications