మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం.. చివరికి అలా కూడా !!

సభ్య సమాజం సైతం తలదించుకునే దుర్ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. ఈ పరిణామాల్లోనే నేటి కాలంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. ఇక ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది.

ఓ చర్చి పాస్టర్.. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికంగా చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి.. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికను వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుని బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

church-pastor-physical-assault-on-minor-girl-at-eluru-district-and-news-got-viral-on-social-media

అయితే కొంతకాలం తర్వాత బాలిక ఆరోగ్యంలో మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అనంతరం ఆమె గర్భవతి అయిన విషయం బయటపడడంతో.. ఈ విషయం బయటకు వస్తే తనపై కేసులు నమోదవుతాయని భయపడి బాలికకు అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ మాత్రల ప్రభావంతో బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. బాలిక పరిస్థితి క్షీణించడంతో భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. మైనర్ బాలికపై లైంగిక దాడి, బెదిరింపులు, ఆరోగ్యానికి హానికర చర్యలకు సంబంధించి పోక్సో (POCSO) చట్టంతో పాటు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారులు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+