వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాలయ విజయ్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం భారతి పే పేరిట సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారం పైన సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సీఐడీ అధికారులు నర్సీపట్నంలోని విజయ్ నివాసానికి వెళ్లారు. అక్కడ విజయ్ తల్లి..మున్సిపల్ కౌన్సిలర్ అయిన పద్మావతిని విజయ్ కోసం వాకబు చేసారు.

ఆయన అందుబాటులో లేకపోవటంతో పద్మావతికి నోటీసులు అందించారు. అయిదు సెక్షన్ల కింద విజయ్ పైన కేసు నమోదు చేసారు. అక్టోబర్ 1న మంగళగిరి సైబర్ క్రైమ్ స్టేషన్ లో గత ఏడాది అక్టోబర్ 1న క్రైమ్ నెంబర్ 14/2022 తో కేసు నమోదైనట్లు నోటీసులో వివరించారు.

CID issues 41A notices to TDP leader Chintakayala Vijay in a social media campaign case

ఈ నెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు కావాలని సూచించారు. గతంలోనూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కు సంబంధించి చింతకాయల విజయ్ కు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఆ సమయంలో సీఐడీ సిబ్బంది వ్యవహార శైలి పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి.

దీని పైన విజయ్ న్యాయస్థానం ఆశ్రయించారు. విచారణ చేయాలని భావిస్తే ముందుగా 41(ఏ0 నోటీసు జారీ చేసి వెళ్లాలని సూచించింది. దీంతో, విజయ్ పైన చర్యలను అప్పట్లో నిలిపివేసారు. ఇప్పుడు మరోసారి విజయ్ ను విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నర్సీపట్నం వెళ్లి నోటీసులు అందించారు.

CID issues 41A notices to TDP leader Chintakayala Vijay in a social media campaign case

ఈ నెల 27న టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. అదే రోజున విచారణకు రావాలంటూ విజయ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. విజయ్ ప్రస్తుతం లోకేష్ కు సన్నిహితంగా ఉంటున్నారు పార్టీలో కొంత కాలంగా క్రియాశీలకంగా మారారు. ఇటు లోకేష్ పాదయాత్ర ప్రారంభ రోజున పార్టీ ముఖ్య నేతలతో పాటుగా అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్ లు హాజరు కావాలని పార్టీ అదేశించింది.

అదే రోజున విజయ్ తమ ముందు హాజరు కావాలని ఇప్పుడు విజయ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు సీఐడీ నోటీసుల పైన విజయ్ స్పందన చూడాలి. ఆయన ఆ రోజున విచారణకు హాజరవుతారా లేక సమయం కోరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

English summary
CID Officials issues 41A notices for TDP Youth leader Chintakayala Vijay at Narsipatnam in campagin in Social media case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X